మనిషి లోపల మానవత్వం చచ్చిపోతోంది. మనిషన్న వాడు చేసే పనేనా? అన్న సందేహం కలిగేలా చోటు చేసుకుంటున్న అకృత్యాల్లో తాజాగా మరొకటి నమోదైంది. దీనికి ముజఫర్ నగర్ వేదికైంది. నోటితో చెప్పేందుకు సైతం సిగ్గుపడేలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లో ఒక దారుణం వెలుగు చూసింది. కదిలే కారులో నుంచి మూడేళ్ల చిన్నారిని రోడ్డు మీదకు విసిరేసి.. తల్లిపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గం బయటకు వచ్చింది.
విన్నంతనే ఉలిక్కిపడే ఈ ఉదంతం ఎలా చోటు చేసుకుందన్న విషయాన్ని చూస్తే.. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందిన ఒక మహిళకు ఉద్యోగం ఇస్తానని నమ్మించాడు ఆర్కే మొహతా అనే వ్యక్తి. దీంతో నమ్మిన సదరు మహిళ.. ఆర్కే మొహతాను కలిసింది. మహిళను కారులో ఎక్కించుకున్న సదరు వ్యక్తి.. ఆ మహిళపై లైంగిక వేధింపులకు దిగాడు.
దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిందా మహిళ. దీంతో కదిలే కారులో నుంచి చిన్నారిని బయటకు విసిరేసిన ఆ దుర్మార్గుడు.. బలవంతంగా ఆమె చేత మత్తు మందు కలిపిన మద్యం తాగించాడు. అనంతరం ఆమెను తన స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను చపార్ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు.
స్పృహలోకి వచ్చిన ఆ మహిళ పోలీసులను కలిసి జరిగిన దారుణాన్ని వివరించింది. అదృష్టవశాత్తు కారులో నుంచి విసిరేసిన మూడేళ్ల బాబు క్షేమంగా ఉన్న వైనం బయటకు వచ్చింది. కదిలే కారులో నుంచి మూడేళ్ల చిన్నారిని బయటకు పడేసిన వైనాన్ని గుర్తించి స్థానికులు.. వెంటనే ఆ చిన్నారిని కాపాడే ప్రయత్నం చేశారు. దెబ్బలు తిన్న ఆ చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దారుణాన్ని నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఆర్కే మొహతా అతని స్నేహితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టించింది.