నాటకీయ పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన ప్రతి మాటలోనూ.. నడకలోనూ తెలీని నాటకీయత కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. అదేం సిత్రమో కానీ.. బాబు హోదా గురించి మాట్లాడిన ప్రతిసారీ.. రాజధాని నిర్మాణం కోసం తపించిన ప్రతిసారీ పలువురు రియాక్ట్ అవుతుంటారు. తమ సొంత ఆస్తుల్ని ఇచ్చేందుకు ముందుకు వస్తుంటారు.
ఏపీ రాజధాని కోసం దేనికైనా రెఢీ అన్న భావన చాలామంది ఆంధ్రోళ్లలో కనిపిస్తూ ఉంటుంది. ఆ మధ్యన అమరావతి నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలంటూ ఇటుకలు అమ్మిన ప్రోగ్రాంలో దేశ.. విదేశాల్లో ఉన్న ఎంతోమంది తెలుగువారు తమ శక్తి కొలదీ సాయాన్ని అందించే ప్రయత్నం చేశారు.
ఇటుకలు కొన్నోళ్లు ఇటుకలు కొంటే.. మరికొందరు నగదును.. ఆస్తుల్ని.. బంగారాన్ని విరాళంగా ఇచ్చినోళ్లు ఉన్నారు. అప్పట్లో వారంతా కోరుకున్నది ఒక్కటే.. రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలి. ఆంధ్రోళ్లకు రాజధాని లేదన్న కొరత నుంచి బయటకు రావాలని.
కానీ.. గడిచిన నాలుగేళ్ల కాలంలో ఏపీలో నెలకొన్న అవినీతి ఎంతన్నది బహిరంగ రహస్యం. ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు మీద ఏపీ ప్రజలు పెట్టుకున్న ఆశలు.. ఆకాంక్షలు చాలానే. కానీ.. వాటిలో వేటిని ఆయన పట్టించుకున్నది లేదు. ఎక్కడి దాకానో ఎందుకు.. ప్రతి ఏడాది తమ ఆస్తుల వివరాల్ని డాబుగా ప్రకటిస్తుంటుంది బాబు ఫ్యామిలీ. డాబు అన్న మాట ఎందుకంటే.. వందలాది కోట్ల ఆస్తులు ఉన్న బాబు.. ఏ రోజు కూడా ఏపీ రాజధాని అమరావతి కోసం తన ఆస్తిలో కొంత భాగాన్ని ఇస్తున్నట్లుగా ప్రకటించింది లేదు.
ప్రజల్ని అనునిత్యం త్యాగాలు చేయాలని..అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవాలని చెప్పే బాబు.. ప్రజల కంటే ముందుగా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను తన కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ రాజధాని నిర్మాణం కోసం తనవంతు విరాళాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. కానీ.. అదేమీ లేకుండా నిత్యం ప్రజల్ని అడగటమే కానీ తన కుటుంబం తరఫున అమరావతికి ఇచ్చిందేమీ ఉండదు.
తాజాగా సైకిల్ యాత్రను చేపట్టిన చంద్రబాబుకు ఒక మహిళ రూ.5లక్షల మొత్తాన్ని అమరావతి నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు. దాన్ని ఆనందంగా తీసుకున్న బాబు.. ఆమె తరహాలోనే ప్రజలంతా ముందుకు రావాలన్నారు. అందరిని అడిగే ముందు.. తన బాధ్యతగా తనకున్న వందల కోట్ల ఆస్తుల్లో నుంచి బాబు ఎందుకు అమరావతి కోసం ఇవ్వరు? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం రాని పరిస్థితి.అందరిని సాయం చేయాలని అడిగే చంద్రబాబు.. తాను.. తన కుటుంబ సభ్యులు సాయాన్ని ఎందుకు ప్రకటించరు?