తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కోట్లాది మందిని తప్పుదారి పట్టించిన ఆమె వ్యవహారం బెంగళూరు ప్రజల్ని మాత్రమే కాదు.. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా అవాక్కు అయిపోతున్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్ల సమయంలో కొందరు మృగాళ్లు బెంగళూరు అమ్మాయిల మీద ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఒక అమ్మాయిని రోడ్డు మీదనే లైంగిక దాడికి యత్నించిన దారుణం సీసీ ఫుటేజ్ తో బయటకు వచ్చింది.
వరుసగా వెలుగు చూసిన ఈ ఉదంతాల్ని చూసిన మరో అమ్మాయి మదిలో మెదిలిన దుర్మార్గపు ఆలోచన.. బెంగళూరు సిటీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసింది. వరుస ఉదంతాలతో గార్డెన్ సిటీ అంటేనే అందరూ జడుచుకునేలా మారిన పరిస్థితుల్లో.. బురఖా వేసుకొని వెళుతున్న ఒక అమ్మాయి మీద ఆగంతకుడు ఒకడు రోడ్డు మీద దాడి చేశాడని.. నాలుక మీదా.. పెదాల మీద గాయం చేశాడంటూ హడావుడి చేసిన అమ్మాయి వ్యవహారం అసలు కథను పోలీసులు బయటపెట్టారు.
గార్డెన్ సిటీలో ఘోరం అంటూ మీడియాలో హోరెత్తిన కథనాలన్నీ నిజం కాదని.. సదరు అమ్మాయి తన స్వార్థం కోసం ఆడిన నాటకంలో అందరూ ఫూల్స్ అయిన విషయం తాజాగా బయటకు వచ్చింది. రోడ్డు మీద వెళుతున్న తనను ఒక వ్యక్తి బలవంతంగా ముద్దు పెట్టుకొని.. లైంగికంగా దాడి చేసినట్లుగా ఆరోపించిన ఆరోపణల మీద అనుమానం వచ్చిన పోలీసులు.. బాధితురాలిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు.
పొంతన లేకుండా చెబుతున్న సమాధానంతో సందేహం వచ్చి మరింత నిశితంగా ఈ ఇష్యూ మీద దృష్టి సారించిన పోలీసులకు షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే.. బాధితురాలిని రోడ్డు మీద లైంగిక దాడి చేసింది ఎవరో కాదు.. సొంత బావే. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే సొంత అక్క మొగుడే. ఇదంతా కావాలని.. ప్లాన్ ప్రకారం బాధితురాలిగా చెప్పుకునే మహిళ.. నిందితుడు కలిసి ఆడిన నాటకంలో భాగం మాత్రమే.
ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చిన నేపథ్యంలో అక్క ఇంటికి వచ్చింది బాధితురాలు(?) మూడేళ్లుగా అక్క ఇంట్లోనే ఉండిపోయింది. అదే సమయంలో బావతో ప్రేమలో పడిపోయింది. పెళ్లి చేసుకునేందుకు అక్క ఊరుకోదన్న ఉద్దేశంతో.. బావను సాయంగా చేసుకొని.. తనకు జరగరానిది ఏదో జరిగినట్లుగా నాటకం ఆడేస్తే.. తనను పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారన్న దూరాలోచనతో బావతో చెప్పి దరిద్రపు ప్లాన్ వేసింది.
తాను రోడ్డు మీద వెళుతుంటే.. ఎవరో తనను లైంగిక దాడి చేసినట్లుగా ఆరోపించి.. హడావుడి చేసింది. ఇదంతా నిజమేనని నమ్మిన మీడియా అడ్డంగా బుక్ అయ్యింది. ఇక.. సీసీ పుటేజ్ ని జాగ్రత్తగా గమనించిన పోలీసులకు ఏదో అనుమానం రావటంతో.. తమదైన శైలిలో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. బాధితురాలిగా చెప్పుకునే మహిళపై దాడి చేసింది ఆమె బావేనని.. అదంతా ప్రీప్లాన్డ్ గా వేసుకున్న నాటకంలో భాగమన్న విషయం తేలటంతో ఈ ఇష్యూ గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/