సెల్ ఫోన్ వాడకం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సెల్ ఫోన్ మితిమీరిన వినియోగంతో అనేక చిక్కులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తరచుగా స్నేహితులను కలవటం - మాట్లాడుకోవటం తగ్గిపోతోంది. చాలామంది పార్టీలకు కూడా వెళ్లటం లేదు - విహార యాత్రలపై ఆసక్తి లేదు. తల్లిదండ్రులతో కలిసి ఎక్కడైనా బయటకు వెళ్లే సందర్భాలు దాదాపు లేనట్లే.....ఒకే ఇంట్లో ఉంటున్నా తల్లిదండ్రులకు వారు మానసికంగా దగ్గర కాలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఏదైనా చెప్పబోతున్నా సరే సరేలే.. అని దాటవేసి సెల్‌లో లీనమైపోతున్నారు. ఇలా ఆబ్సెంట్ మనస్తత్వంతో ఓ మహిళ చావు అంచుల్లోకి వెళ్లి వచ్చింది.
అడ్వాన్స్ డ్ పార్కింగ్ విధానం గురించి తెలిసిన సంగతే. ఆటోమెటిక్ గా అండర్ గ్రౌండ్ లో కార్లను వరుసగా...ఒకదాని మీద ఒకటి పేరుస్తారు. అవసరమైన కారును లిఫ్ట్ సహాయంతో బయటకు తెస్తారు. ఆ సమయంలో కార్ లిఫ్ట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది స్థూలంగా అడ్వాన్స్ డ్ పార్కింగ్ విధానం. అయితే చైనాలోని కార్యాలయాల్లో పార్కింగ్ మొత్తం ఇలాగే ఉంటుంది. చైనాలోని నాన్ జింగ్ సిటీలో నివసిస్తున్న ఓ యువతి ఇలాంటి వ్యవస్థ వద్ద ప్రమాదానికి లోనైంది. ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరింది.
ఎప్పట్లాగే...ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వెళ్లేందుకు పార్కింగ్ ప్లేస్ కు వచ్చింది. అక్కడ కూడా కార్ పార్కింగ్ ను గమనించకుండా.. స్మార్ట్ స్క్రీన్ మీద వేళ్లు టకటకలాడిస్తూ.. ముందుకు నడుస్తోంది. ఫోన్ మాయలో ఉన్న సదరు యువతి...అసలేమాత్రం స్పృహలో లేకపోవడంతో కార్ లిఫ్ట్ లోకి వెళ్లిపోయింది. అయితే ఆటోమెటిక్ లాక్ ఉండటంతో...ఆమె తలుపు వద్దే ఆగిపోయింది. అయితే...అదే సమయంలో లిఫ్ట్ కిందికి రావడం..ఆ వెంటనే కారు ఎదురుగా దూసుకురావడం..ఆమెను గుద్దేయడం వంటివి వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే అదృష్టవశాత్తు ఆమె ప్రాణం పోలేదు. ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పార్కింగ్ ప్లేస్ లో ఉన్న సీసీటీవీలో ఈ యాక్సిడెంట్ అంతా రికార్డయింది. ఆ వీడియోలో ఈ ప్రమాద దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, సెల్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే... డైరెక్టుగా హెల్ కు పోతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవల విడుదల అయిన ఓ సర్వేలో సెల్ ఫోన్ అధికంగా వాడుతుండటంపై పలు హెచ్చరికలు వచ్చిన సంగతి తెలిసిందే. శాన్‌డియాగో విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల ప్రకారం...సెల్ ఫోన్ అధికంగా ఉపయోగించడం వల్ల కుంగుబాటు సర్వసాధారణ సమస్యగా మారింది. ఆత్మహత్యల సంఖ్య అధికం అయింది. అమెరికాలోని యువకుల్లో కుంగుబాటు సమస్య 2012 నుంచి 2015 మధ్యకాలంలో 21 శాతం పెరిగింది. యువతుల్లో అయితే 50 శాతం మేరకు పెరిగింది. ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకరంగా పెరిగిపోయింది. యువతుల ఆత్మహత్యల రేటు ఎంతో అధికంగా ఉంది. 2007తో పోల్చితే 2015 లో 14 ఏళ్ల యువతులు ఆత్మహత్యలు చేసుకోవటం మూడు రెట్లు పెరిగింది. యువకుల్లో ఆత్మహత్యల రేటు కంటే ఇది రెట్టింపు.
Full View