క‌డుపుకోసం ఒళ్ల‌మ్ముకుంటున్నార‌న్న కేంద్ర మంత్రి

Update: 2016-09-02 05:35 GMT
కేంద్ర మంత్రి - యూపీకి చెందిన నేత అనుప్రియా ప‌టేల్‌.. మ‌హిళ‌ల గురించి ఫీలైపోయారు. మ‌హిళ‌ల‌కు ఇప్ప‌టికీ స్వ‌తంత్రం రాలేద‌న్నారు. ఆమె కుటుంబంలో ఓ బందీ అని చెప్పుకొచ్చారు. కుంటుంబ స‌భ్యుల ఒత్తిడికి త‌లొగ్గి.. త‌న జీవితాన్ని ఫ‌ణంగా పెడుతోంద‌ని వాపోయారు. అదేస‌మ‌యంలో కేవ‌లం క‌డుపు నింపుకోవ‌డం కోస‌మే కొంద‌రు మ‌హిళ‌లు క‌డుపు(గ‌ర్భాల‌ను)లు అమ్ముకుంటున్నార‌ని  అను అన్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌స్తుత పీఎం మోడీని ఆమె ఆకాశానికి ఎత్తేస్తూ.. ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌ను వినియోగించుకుని మ‌హిళ‌లు.. అభివృద్ధి చెందాల‌ని ఆమె సూచించారు.  

ఈ మేరకు గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా తీసుకువ‌చ్చిన స‌రోగ‌సి(అద్దె గ‌ర్భం) గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇంత‌కు ముందు వ‌ర‌కు విదేశాల‌కే ప‌రిమిత‌మైన స‌రోగ‌సి.. ఇటీవ‌ల కాలంలో దేశంలో విజృంభించింద‌న్నారు. దీనిని అరిక‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, మ‌హిళ‌ల‌పై దీని ఒత్తిడి పెరిగింద‌ని అన్నారు. అద్దె గ‌ర్భాల‌ను ఇచ్చే మ‌హిళ‌ల‌పై ఆయా కుంటుంబాల్లోని వారి ఒత్తిడి విప‌రీతంగా ఉంటోంద‌ని మంత్రి తెలిపారు. స‌రోగ‌సి వ‌ల్ల భారీస్థాయిలో డ‌బ్బులు చేకూరుతున్నందున ప్ర‌తి ఒక్క‌రూ ఆదిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని, అందుకే దీనిని నిరోధించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంటూ.. కేంద్రం తెచ్చిన స‌రోగ‌సి బిల్లును ఆమె పూర్తిగా స‌మ‌ర్థించారు.

దీనిని అమ‌లు చేయ‌డం ద్వారా మ‌హిళ‌ల ఆరోగ్యంపై ఒత్తిడి త‌గ్గుతుంద‌ని చెప్పారు. ఇక‌, స‌రోగ‌సి బిల్లు ద్వారా.. ఎవ‌రికి ప‌డితే వారికి అద్దె కోసం గ‌ర్భాన్ని ఇచ్చే ఛాన్స్ ఇక‌పై ఉండ‌దు. అయితే, త‌మ బంధువులు, ర‌క్త సంబంధీకుల‌కు మాత్రం స‌రోగ‌సి ద్వారా బిడ్డ‌ల‌ను క‌ని ఇవ్వ‌వ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో దీనిపై ఎలాంటి నిబంధ‌న‌లూ లేవు. దీంతో గే స‌హా పిల్ల‌లు పుట్ట‌ని జంట‌లు, ఎన్నారైలు కొంత డ‌బ్బు చెల్లించి.. పేద కుటుంబాల‌కు చెందిన మ‌హిళ‌ల గ‌ర్భాల‌ను వినియోగించుకుంటున్నారు. ఇక‌పై ఇలాంటి వాటికి అడ్డుక‌ట్ట ప‌డ‌నుంది. అయితే, ఈ బిల్లు వ‌ల్ల నిజాయితీగా ఉండేవారికి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని కొంద‌రు అంటున్నారు.
Tags:    

Similar News