నాలుగో టీ20 ఎంతో ఉత్కంఠ భరితంగా సాగి చివరకు టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఇన్సింగ్స్ లో ఆఖర్లో కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకొని రోహిత్ కు అవకాశం ఇచ్చాడు. రోహిత్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోవడం వల్లే టీమిండియా జట్టుకు విజయతీరాలకు చేరిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎంతో ఉత్కంఠ భరితంగా నాలుగో టీ20 సాగింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ తప్పలేదు. చివరకు 8 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీని నమోదు చేసింది.అయితే మ్యాచ్ చివర్లో చిన్న గాయం వల్ల కోహ్లీ బయటకు వెళ్లిపోయాడు. సరిగ్గా ఆ టైంలో రోహిత్ శర్మ జట్టును నడిపించాడు.
16వ ఓవర్‌లో కోహ్లీ గాయపడ్డాడు. ఫిజియోల సూచనమేరకు ముందు జాగ్రత్తగా మైదానం వీడాడు. దాంతో.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. 17వ ఓవర్ నుంచి తనదైన శైలిలో జట్టుకు ముందుకు నడిపించాడు. అప్పటికి మ్యాచ్ ఇంకా టీమిండియా చేతిలో లేదు. బెన్‌స్టోక్స్, ఇయాన్ మోర్గాన్ ప్రమాదకరంగా ఆడుతున్నారు. ఇండియా ఓడిపోతుందేమో అనున్నారంతా. కానీ సరిగ్గా ఆ టైంలో రోహిత్ శార్ధూల్ ఠాకూర్ కి బౌలింగ్‌కు అవకాశం ఇచ్చాడు. అతడు ఈ ఇద్దరిని ఔట్ చేసి టీమిండియాను గట్టెక్కించాడు.
ఆ తర్వాత ఓవర్‌ను హార్దిక్ పాండ్యాతో వేయించిన రోహిత్.. కీలకమైన 19వ ఓవర్‌లో భువనేశ్వర్‌ను రంగంలోకి దింపాడు. చివరి ఓవర్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఆ ఓవర్‌లో ఇంగ్లాండ్ గెలవాలంటే 23 పరుగులు కావాలి. దీంతో రోహిత్ మళ్లీ ఠాకూర్ ను బౌలింగ్‌కు దింపాడు.అతను కొన్ని పరుగులిచ్చినా.. సలహాలు, సూచనలు చేస్తూ అతడిలో స్థైర్యాన్ని నింపాడు. ఆ టైంలో వరస బౌండరీలతో ఆర్చర్ చెలరేగగా.. వైడ్లతో శార్దూల్ టెన్షన్ పెట్టాడు. కానీ రోహిత్, పాండ్యా సూచనలతో ఒత్తిడిని అధిగమించిన అతను చివరి మూడు బంతులను కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ విజయం లాంఛనమైంది.
దాంతో.. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు మంచి మార్కులు పడ్డాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీ పట్ల ప్రశంసలు అందుతున్నాయి. కీలక సమయంలో సరైన బౌలర్లను దించి రోహిత్ జట్టు విజయానికి కారకుడయ్యాడని సీనియర్ క్రికెటర్లు, కామెంటర్లు ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ప్రశంసలు దక్కుతున్నాయి. రోహిత్ కెప్టెన్సీ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.