వ‌ర్క్ ప‌ర్మిట్ వీసా గ‌డువు 18 నెల‌లు పొడిగింపు.. బైడెన్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Update: 2022-05-04 08:39 GMT
అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణ‌యం.. ప్ర‌పంచానికి ఉర‌ట క‌లిగిస్తోంది. వర్క్ పర్మిట్ వీసా గడువు ముగుస్తున్న కొన్ని కేటగిరీల వారికి మరో 18 నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.  ఈ నిర్ణయంతో భారతీయులతో పాటు వేలాది మంది వలసదారులకు ఊరట కలగనుంది.

వీటిలో గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్నవారు.. హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు ఉన్నారు. ఈ నిర్ణయం మే 4 నుంచి(ఈ రోజు) అమల్లోకి రానున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ప్రస్తుతం ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ కార్డ్‌ (ఈఏడీ)ల గడువు తీరిన తర్వాత కూడా 180 రోజుల వరకు వాటిని ఉపయోగించుకునే వీలుండగా.. ఇప్పుడు దాన్ని 540 రోజులు (18నెలల వరకు) ఆటోమేటిక్‌గా పొడిగిస్తున్నట్లు హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (యూఎస్‌ఐఎస్‌సీ) తెలిపింది.

అమెరికా పౌరసత్వ, వలస సేవల వద్ద ఈఏడీల రెన్యూవల్‌కు దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్‌ఐఎస్‌సీ డైరెక్టర్‌ తెలిపారు.

తాజా నిర్ణయంతో ఈఏడీ రెన్యూవల్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న వలసదారులు తమ వర్క్‌ పర్మిట్ గడువు ముగిసినా.. మరో 540 రోజుల పాటు పని అనుమతులు పొంది ఉద్యోగాలు కొనసాగించొచ్చు. దీని ద్వారా అమెరికాలో ఉద్యోగుల కొరత కొంత తగ్గడంతో పాటు వలసదారుల కుటుంబాలకు కూడా ఆర్థికంగా సహకారం లభిస్తుందని బైడెన్ సర్కారు వెల్లడించింది.

ఈ నిర్ణయంతో దాదాపు 87వేల మంది వలసదారులకు తక్షణమే లబ్ధి చేకూరడంతో పాటు దాదాపు 4.20 లక్షల మంది వలసదారులు పని అనుమతులు కోల్పోకుండా ఉంటారని ఇండియన్‌ అమెరికన్‌ కమ్యూని టీ నేత అజయ్‌ జైన్‌ తెలిపారు. ఇందులో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు.
Tags:    

Similar News