భారతదేశంలో మధుమేహంతో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని ఓ సర్వే వెల్లడైంది. ఇందుకు మన దేశంలో ఉండే ప్రజల ఆహార విధానాలే కారణాలు ఉన్నాయని పేర్కొంది. మరో వైపు ప్రపంచంలో ఉండే వయోజనుల్లో చాలా మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారని పేర్కొంది. కనీసం ప్రతి పది మందిలో ఒకరు మధుమేహ వ్యాధితో పోరాడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ సంఖ్య నానాటికీ గణనీయంగా పెరుగుతూ ఉండడం వైద్య నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే భారతదేశంలో సుమారు ఏడు కోట్ల మందికి పైగా వయోజనులు డయాబెటిస్ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరుగుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 2045 నాటికి మధుమేహంతో బాధపడే వారి సంఖ్య సుమారు 13.4 కోట్లకు పైనే ఉంటుందని లెక్కలు వేస్తున్నారు.
మధుమేహ వ్యాధి కేవలం ముసలి వయసులో ఉన్న వారిలోనే వస్తుందని అనుకోవడం పొరపాటని వైద్యులు చెప్తున్నారు. ఈ వ్యాధికి ఫలానా వయసు వారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క వయసు వారికి వస్తుంది . అయితే ఇటీవల చేపట్టిన సర్వేలో భారత దేశంలో ఉండే వారిలో ఇరవై ఐదు సంవత్సరాల వయసు కంటే పై బడిన వారిలో ఎక్కువ మంది ఈ వ్యాధి తో బాధపడుతున్నట్లు స్పష్టమైంది. వీరిలో అడల్ట్ డయాబెటిస్ అనేది ఎక్కువగా వస్తున్నట్లు ఐసిఎంఆర్ గణాంకాలు చెబుతున్నాయి.
మనదేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా డయాబెటిస్ కేసులు గణనీయంగా వెలుగు చూసినట్లు పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. సాధారణంగా డయాబెటిస్ రావడానికి గల కారణాలను కూడా పేర్కొన్నాయి. వయోజనుల్లో ఈ వ్యాధి రావడానికి గల కారణాల్లో ప్రధానంగా అధికంగా ఆలోచించడం. ఇలా ఒక విషయంపై పదే పదే ఆలోచించడంతో ఎక్కువమంది మధుమేహం వ్యాధి బారిన పడినట్లు ఒక సర్వే చెబుతోంది. అంతేకాకుండా ఎక్కువసేపు పని మీద కూర్చోవడం ఈ వ్యాధికి కారణమవుతుందని మరో సర్వే పేర్కొంది.
ఉద్యోగస్తులు ఎక్కువమంది షిఫ్ట్ ల విధానంలో పనిచేయడం వల్ల వారిపై ఒత్తిడి అంతకంతకూ పెరిగి మధుమేహానికి దారితీస్తుందని వైద్య అధికారులు చెబుతున్నారు. డయాబెటిస్ రావడానికి కేవలం పైన చెప్పిన లక్షణాలే కాకుండా మరొకటి కూడా ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నట్లయితే వారి తర్వాతి తరం వారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైనట్లు తెలిపారు. ఏదేమైనా నానాటికీ పెరుగుతున్న మధుమేహం కేసులతో ప్రస్తుతం యువత జాగ్రత్త వహించాలని ఇందుకు తగిన ఆ విధంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు.