అసలే ఆస్ట్రేలియా.. అందులోనూ వర్షాలకు అవకాశం ఉన్న కాలం.. కానీ, అక్కడే ప్రపంచ కప్ నిర్వహించాల్సి వచ్చింది. దీంతో మ్యాచ్ లు రద్దు కావడమో.. పాయింట్లు పంచుకోవడమో
జరుగుతోంది. దీంతో జట్ల రాతలు మారుతున్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఇలానే సెమీస్ కు దూరమయ్యాయి. జింబాబ్వేతో గెలిచే స్థితిలో ఉన్న సమయంలో వర్షంతో సౌతాఫ్రికాకు
విజయాన్ని దూరం చేసింది. అగ్రశ్రేణి జట్లు ఇలా నిష్క్రమించడం బాధాకరమే.
అయితే, ఇప్పుడదంతా గతం. ప్రపంచ కప్ సెమీస్ దశకు వచ్చేసింది. సోమ, మంగళవారాలు విరామం. బుధ, గురువారాల్లో పాకిస్థాన్ -న్యూజిలాండ్, భారత్-ఇంగ్లండ్ లు సెమీస్ ఆడనున్నాయి. అయితే, ఆదివారం జరిగే ఫైనల్ కు వర్షం అంతరాయం కలిగిస్తే రిజర్వ్ డే అవకాశం ఉంది. కానీ, టోర్నీలో సూపర్-12, సెమీస్ కు ఆ చాన్సుందా..? ఒకవేళ సెమీఫైనల్స్ రోజు వర్షం పడి మ్యాచ్ రద్దయితే అప్పుడు ఏంటి పరిస్థితి? వర్షంతో సెమీఫైనల్ రోజు మ్యాచ్ లను నిర్వహించలేకపోతేఅప్పుడేం జరుగుతుంది..? ఒక్కసారి ఏం నిబంధనలు ఉన్నాయో పరిశీలిస్తే..
రిజర్వ్ డేలు ఉన్నాయిగా..? టి20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్స్ తో పాటు ఫైనల్ కు రిజర్వ్ డేలు ఉన్నాయి. దాంతో మ్యాచ్ రోజు వర్షంతో ఆట సాధ్యం కాకపోతే మరుసటి రోజు అంటే రిజర్వ్ డే రోజు మ్యాచ్ ను పూర్తి చేస్తారు. మంగళవారం న్యూజిలాండ్ -పాకిస్థాన్ మ్యాచ్ వర్షంతో జరగకపోతే.. గురువారం రిజర్వ్ డే నాడు నిర్వహిస్తారు. అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. పూర్తిగా మొదటి నుంచి కాకుండా.. మ్యాచ్ ఎక్కడైతే నిలిచిపోయిందో అక్కడినుంచే ఆట మొదలవుతుంది.
న్యూజిలాండ్ మొదట ఇన్నింగ్స్ కొనసాగించి మొత్తం ఓవర్లాడి 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఛేదనలో కాప్ 5 ఓవర్లకు వికెట్ నష్టపోయి 30 పరుగులు చేసింది. అప్పుడు వర్షం పడి మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా పడింది. మరుసటి రోజు పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే జరుగుతుంది. అయితే మ్యాచ్ ను ఎట్టి పరిస్థితిలోనూ షెడ్యూల్ రోజే పూర్తయ్యేలా అంపైర్లు చూస్తారు. ఒకవేళ కుదరకపోతేనే రిజర్వ్ డేకు వెళ్తారు.
మళ్లీ మరుసటి రోజూ వాన పడితే.. షెడ్యూల్, రిజర్వ్ డే రెండు రోజుల్లోనూ వర్షం పడిన సందర్భంలో కనీసం 5 ఓవర్ల చొప్పున ఆటను కొనసాగించేందుకు అంపైర్లు చూస్తారు. అలా జరగకపోతే గ్రూేప్స్ లో టాపర్స్ గా నిలిచిన జట్లు ఫైనల్స్ కు చేరతాయి. కివీస్- పాక్ సెమీస్ మ్యాచ్ వర్షంతో రిజర్వ్ డే రోజు కూడా జరగకపోతే అప్పుడు కివీస్ ను విజేతగా నిర్ణయిస్తారు. ఎందుకంటే కివీస్ గ్రూప్ 1 టాపర్ గా నిలిచింది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో సెమీస్ లో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. రెండో సెమీస్ వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు కూడా నిర్వహించలేకపోతే భారత్ విజేతగా నిలిచి ఫైనల్స్ కు
చేరుతుంది.
వర్షం అవకాశాలు తక్కువే.ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పరిస్థితులు చూస్తే వర్షాలు కాస్త తగ్గాయి. టోర్నీ ప్రారంభ సమయంలోలాగా వరుసగా వానలు పడడం లేదు. సూపర్ 12 చివరి మ్యాచ్ లు సజావుగా సాగాయి. అలాగే భారత్ వర్షం కారణంగా ఏ మ్యాచ్ లోనూ ఇబ్బంది పడలేదు. మరోవైపు సెమీస్ కు ఇంకా 2 రోజులుంది. అప్పటికి పరిస్థితి మారవచ్చు. దీన్నిబట్టి చివరి మ్యాచ్ లకు వర్షం అంతరాయం కచ్చితంగా తక్కువేనని చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.