వెహికిల్ 80 దాటితే ఎంత డేంజ‌ర్ అంటే?

Update: 2018-08-30 05:32 GMT
ఒకే ప్ర‌ముఖ కుటుంబంలో ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా రోడ్డు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌టం.. పూడ్చ‌లేని విషాదం చోటు చేసుకోవ‌టానికి ప్ర‌ధాన కార‌ణం..అప‌రిమిత‌మైన వేగం. విషాదంలో మునిగిన వేళ‌.. ఇలా నింద‌లేమిట‌ని కొంద‌రు అనుకోవ‌చ్చు. కానీ.. వాస్త‌వం మాత్రం అదే. నిజాన్ని ఇలాంటి స‌మాయాల్లో కాకుంటే మ‌రెప్పుడు చెప్పుకోవాలి.

వంద‌ల కోట్ల ఆస్తులు.. ఖ‌రీదైన వాహ‌నాల్లో తిరిగే ప్ర‌ముఖులే.. అతి వేగానికి ప్రాణాలు కోల్పోతున్న వేళ‌.. సామాన్యులు మ‌రెంత అప్ర‌మ‌త్తంగా ఉండాలో హ‌రికృష్ణ మ‌ర‌ణం స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్పాలి. వాహ‌నాల్నికొనే వేళ‌.. బ్రాహ్మండ‌మైన ఫీచ‌ర్లు చెప్ప‌టంతో పాటు.. వంద‌.. 120లో వాహ‌నాన్ని నడిపినా ఏమీ కాద‌ని చెప్పే కంపెనీ ప్ర‌తినిధుల తీరు కూడా ప్రాణాలు పోవ‌టానికి కార‌ణంగా చెప్పొచ్చు.

అధునాతన పరిజ్ఞానం.. యాంటీ-స్కిడ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్ లాంటివి ఉన్నా.. వాహ‌నం ప్ర‌మాదానికి గురైతే డ్రైవ‌ర్.. ఇత‌ర ప్ర‌యాణికుల‌కు ప్రాణ‌హాని జ‌ర‌గ‌ద‌ని చెప్పే క్రాష్ టెస్టింగులు ఎన్ని చేసినా.. మోతాదు మించిన వేగం ప్రాణాలు తీస్తుంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. వాహ‌నం ఏదైనా స‌రే.. గంట‌కు 80 కిలోమీట‌ర్ల వేగాన్ని దాటిన మ‌రుక్ష‌ణం.. ప్రాణాల మీద ఆశ‌లు వ‌దులుకోవాల‌ని చెబుతున్నారు. ఈ మాట మేం చెబుతున్న‌ది కాదు.. ప్ర‌పంచ ఆరోగ్యసంస్థ స్ప‌ష్టం చేస్తోంది. వాహ‌న వేగం 80 దాటితే.. ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌టానికి ఎక్కువ అవ‌కాశాలు ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేస్తోంది.

వాహ‌న వేగం గంట‌కు 65-80 కిలోమీట‌ర్లతో స్థిరంగా ఉంటే కారు లోప‌ల కూర్చున్న వారి ప్రాణాల‌కు పెద్ద‌గా ప్ర‌మాదం ఉండ‌దు. అయితే.. ఆ వేగంతో ఎదురుగా వ‌స్తున్న టూవీల‌ర్ ను కానీ.. రోడ్ల‌ను దాటుతున్న వారిని..రోడ్డు మీద వెళుతున్న‌వారిని ఢీ కొంటే మాత్రం వారి ప్రాణాలు పోయే అవ‌కాశాలు ఎక్కువ‌.

వాహ‌నం ఎంత అత్యాధునిక‌మైనా.. డ్రైవింగ్ చేసే వారి మాన‌సిక ప‌రిస్థితి కూడా ప్ర‌మాద తీవ్ర‌త‌ను ప్ర‌భావితం చేసేదిగా ఉంటుంద‌ని చెప్పాలి. ఎందుకంటే.. ప్ర‌మాదాన్ని ప‌సిగ‌ట్టి క్ష‌ణాల్లో వేగాన్ని త‌గ్గించ‌ట‌మో.. ఉన్న‌ప‌ళంగా బ్రేకులు వేయ‌ట‌మో చేయాల‌నే ఆలోచ‌న వారికి త‌ట్టేస‌రికి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రుగుతుంది.

గ‌త సంవ‌త్స‌రం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం ప్ర‌తి డ్రైవ‌ర్ 35 మీట‌ర్ల దూరంలోని ప్ర‌మాదాన్ని మాత్ర‌మే ప‌సిగ‌ట్ట‌గ‌ల‌డు. అలాంట‌ప్పుడు నానో సెక‌న్ల‌లో స్పందించి బ్రేకులు వేసినా.. వాహ‌నం వేగం తగ్గ‌టానికి 14.5 మీట‌ర్ల దూరంలో  ఉంటుంది. ఇలాంట‌ప్పుడు 55 కిలోమీట‌ర్ల కంటే త‌క్కువ వేగంలో వెళుతున్న‌ప్పుడు మాత్ర‌మే డ్రైవ‌ర్ వంద‌శాతం ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా నివాసించే వీలు ఉంటుంది.

ఒక‌వేళ కారు 80 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు 35 మీట‌ర్ల వేగంతో ఉన్న‌ప్పుడు ప్ర‌మాదాన్ని గుర్తించి డ్రైవ‌ర్ స్పందించి బ్రేకులు వేసినా.. 25 మీట‌ర్ల ముందుకు వెళుతుంది.. 55 మీట‌ర్ల దూరం త‌ర్వాత వాహ‌నం బ్రేకులు పూర్తిగా ప‌డ‌వు. దీంతో.. వాహ‌నం గుద్దే వ‌స్తువును 62 కిలోమీట‌ర్ల వేగంతో ఢీ కొడుతుంది. ఇదే ప్రాణాలు పోవ‌టానికి కార‌ణ‌మ‌వుతుంది. వాహ‌న వేగాన్ని ప్ర‌తి ఒక్క‌రూ 5 శాతం త‌గ్గిస్తే.. జ‌రిగే ప్ర‌మాదాల్లో 30 శాతం వ‌ర‌కూ త‌గ్గే వీలు ఉంటుంది. ఆలోచించండి.. వాహ‌నాలు న‌డిపే ప్ర‌తి ఒక్క‌రి మీదా వారి కుటుంబాలు ఎన్నో ఆశ‌లు.. ఆకాంక్ష‌లు పెట్టుకొని ఉంటాయ‌న్న వాస్త‌వాన్ని అస్స‌లు మ‌ర్చిపోవ‌ద్దు.
Tags:    

Similar News