శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని ప్రయాణికులు ఈ రోజు.. శనివారం ఒక్కట్రెండు సార్లు ఉలిక్కిపడే అవకాశం ఉంది. మేఘ గర్జన లాంటి భారీ మోతతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో హడావుడి నెలకొనటం ఖాయం. ఎందుకంటే ప్రపంచంలోనే అది పెద్దదైన విమానం శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి రానుంది. ఈ విమానం ఎంత పెద్దదన్న విషయాన్ని సింఫుల్ గా ఒక్కమాటలో చెప్పేయాలంటే.. మనమందరం చాలా పెద్దదిగా భావించే బోయింగ్ 737 విమానాన్ని ఈ జెయింట్ విమానంలో సులువుగా దూర్చేయొచ్చు. మరింత పెద్ద విమానాన్ని ఏ కంపెనీ తయారు చేసింది.. దాని పేరేంటన్న విషయంలోకి వెళితే.. దీన్ని 1980లలో సోవియట్ యూనియన్ సమయంలో ప్రత్యేకంగా తయారు చేశారు. దీన్ని ఏఎన్ -225 మ్రియ అని పిలుస్తుంటారు. ఇంతకీ మ్రియా అంటే ఏమిటంటారా?అక్కడికే వస్తున్నాం.. మ్రియా అంటే.. ‘‘కల’’ అని అర్థం.
గాడ్జిల్లా లాంటి ఈ కార్గో విమానం శంషాబాద్ కు ఎందుకు వస్తుందంటే దానికి కారణం లేకపోలేదు. చెక్ రిపబ్లిక్ తయారుచేసిన బ్రష్ సెమ్ ఇంజనీరింగ్ అనే సంస్థ తయారు చేసిన 130 టన్నుల బరువున్న జనరేటర్ ను ఆస్ట్రేలియాకు చెందిన ఒక మైనింగ్ కంపెనీ పెర్త్ కు తెప్పించుకోవాల్సి ఉంది. అంత పెద్ద జనరేటర్ ను త్వరగా తెప్పించుకోవటానికి వీలుగా.. ఈ కార్గో విమానాన్ని ఉపయోగించుకోవాలని డిసైడ్ చేశారు. దీంతో.. ఈ జెయింట్ జనరేటర్ ను తీసుకొని ప్రేగ్ నుంచి బయలుదేరిన పే..ద్ద విమానం మధ్యలో ప్యూయల్.. ఇతర అవసరాల కోసం భారత్ లో కొన్ని గంటలు ఆగాల్సి ఉంది. ఇందులో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను ఎంచుకున్నారు.
దేశంలో ఎన్నో విమానాశ్రయాలు ఉన్నా మన శంషాబాద్ నే ఎందుకు ఎన్నుకున్నారంటే దానికీ లెక్కుంది. గాడ్జిల్లా లాంటి ఈ భారీ విమానాన్ని ల్యాండ్ చేసేందుకు సరిపడా పొడవైన రన్ వే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోనే ఉండటం.. ఎయిర్ ట్రాఫిక్ సాంద్రత.. వేరే ఖండాలకు వెళ్లటానికి అనువుగా ఉండటంతో శంషాబాద్ లో హాల్ట్ కోసం ఆపనున్నారు. శుక్రవారం నాడు ల్యాండ్ అయ్యే ఈ విమానం శనివారం వరకూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉండనుంది. దాదాపు 20 గంటలు ఉండే ఈ ‘కల’ 120 టన్నుల (ఒక్కో టన్ను అంటే వెయ్యి కిలోలు) ఇంధనాన్ని నింపి టేకాప్ చేస్తారు. జకర్తా మీదుగా పెర్త్ లో ల్యాండ్ కానుంది. ఈ విమానానికి సంబంధించి మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. దీనికి మొత్తం ఆరు ఇంజిన్లు ఉంటాయి. అందుకే.. దీన్ని స్టార్ట్ చేసిన వెంటనే ఓ పెద్ద హోరుతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఒక్కక్షణం ఉలిక్కిపడటం ఖాయం.