కరోనా వల్ల వీర్యానికి పెరిగిన డిమాండ్!

Update: 2021-03-04 16:30 GMT
కోడి గుడ్లు పెట్టి పిల్లలను కన్నట్టే ఓ మహానుభావుడు కరోనా లాక్ డౌన్ లో పనిలేక అదే పని పెట్టుకున్నట్టున్నాడు.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 35మంది పిల్లలను కన్నాడు. అయితే ఇది ప్రత్యక్షంగా కాదు లేండి పరోక్షంగా...

కరోనా లాక్ డౌన్ వేళ అందరి ఉద్యోగాలు, ఉపాధి పోయి ఇంట్లో ఉన్నారు. కరోనా వైరస్ సోకిన వారిలో కూడా వీర్యనాణ్యత, శృంగార సామర్థ్యం తగ్గిపోయింది. దీంతో ఆ ఒత్తిడి సమయంలో సంతోనాత్పత్తి సమస్యలు పెరిగాయని అనేక అధ్యయనాలు తేల్చాయి.

దీంతో ప్రపంచవ్యాప్తంగా వీర్య దాతలకు డిమాండ్ పెరిగిపోయింది. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కు చెందిన 29 ఏళ్ల కైల్ గోర్డి అనే వ్యక్తి వీర్యదాతగా మారి సంతాన సమస్యలతో బాధపడేవారికి వీర్యాన్ని దానం చేశాడు. అలా 35మంది పిల్లలను కన్నాడు.

గోర్డీ రెండు స్పెర్మ్ డొనేషన్ ఫేస్ బుక్ గ్రూపులను నడుపుతున్నాడు. నాలుగేళ్లుగా ఇదే పని పెట్టుకున్నారు. ఈ గ్రూపులో దాదాపు 15వేల మంది సభ్యులున్నారు. సంతానలేమితో బాధపడుతున్న వారు ఫేస్ బుక్ ద్వారా సంప్రదిస్తే గోర్డీ వెళ్లి వీర్యం దానం చేస్తూ వస్తున్నాడు.

గోర్డీ 22 ఏళ్ల వయసులో లెస్బియన్ దంపతులకు తొలిసారి స్పెర్మ్ దానం చేశాడట.. అప్పటి నుంచి ఇదే పనిగా పెట్టుకున్నాడు. కరోనా టైంలో ఏకంగా 35 మందికి వీర్యం దానం చేసి తండ్రయ్యాడు.
Tags:    

Similar News