దారుణంగా పడేశారు: వైరస్ సోకిన మృతదేహం ఖననంపై సిబ్బంది నిర్లక్ష్యం
వైరస్‌తో ఇప్పుడు ప్రజలు సహజీవనం చేయాల్సిన దుస్థితి దాపురించింది. మనం చేసుకున్న నిర్లక్ష్యానికి మనమే అనుభవించాల్సి వస్తోంది. ఇప్పుడు సర్వత్రా వైరస్ బాధితులు పెరుగుతున్నారు. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తమకు ఎక్కడ సోకుతుందోనని ఈ సందర్భంగా వైరస్ బాధితులపై వివక్ష చూపుతున్నారు. ఇది సామాజిక దుశ్చర్యగా మారింది. అయితే వైద్య సిబ్బంది కూడా వైరస్ బాధితులపై నిర్లక్ష్యంగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ క్రమంలో వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి మృతదేహంపై వైద్య సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అమానుషంగా వారు ప్రవర్తించారు. ఈ సంఘటన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగింది.
వైరస్‌తో తమిళనాడులోని చెన్నైకి చెందిన ఓ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి మృతదేహాన్ని హెల్త్ కేర్ వర్కర్లు ఓ గోతిలోకి విసిరేశారు. తమకు ఎక్కడ వైరస్ సోకుతుందేమోననే సక్రమంగా ఆ మృతదేహం ఖననం చేయలేదు. ఈ సందర్భంగా మృతదేహంపై సక్రమంగా దుస్తులు కప్పలేదు.. శ్మశానం వద్ద మృతదేహాన్ని పై నుంచి గుంతలో పడేశారు. పీపీఈ కిట్లు ధరించిన నలుగురు వర్కర్లు అంబులెన్స్ లో మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆ మృతదేహంతో అమానుషంగా ప్రవర్తించారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం చేయగా వారికి సూపర్‌వైజర్ ఉండగా ఆయన వీరి చర్యను అభినందించారు. మంచి పని చేశారనే ఉద్దేశంతో చేతులతో థంబ్స్ అప్ చూపాడు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. వైద్య సిబ్బంది చర్యకు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో వారిపై మండిపడుతున్నారు. హెల్త్ కేర్ వర్కర్ల విషయం తెలిసి వీరిపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. వారిపై 500 సెక్షన్ కింద కేసు నమోదైందని సమాచారం.