ఇంట్లో వారికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం కామన్. తమకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకునే అబ్బాయిల ఇళ్లల్లో ఉండే రచ్చే ఆ ఇంట్లోనూ ఉంది. కానీ.. ఎవరూ ఊహించని పైశాచికానికి పాల్పడిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. పశ్చిమబెంగాల్ లోని సైద్ పూర్ కు చెందిన నూర్ ఆలం అనే వ్యక్తికి ఎదురైన పరిస్థితి గురించి తెలుసుకున్న వారంతా నోట మాట రానట్లుగా షాక్ లో ఉండి పోతున్నారు. ఇంతకూ జరిగిందేమంటే?
నూర్ ఆలంకు ఒక అమ్మాయి అంటే ఇష్టం. అదే విషయాన్ని ఇంట్లో చెప్పాడు. కానీ.. ఎవరూ సానుకూలంగా స్పందించలేదు. పెళ్లీడు కు వచ్చిన తర్వాత.. ఆ మాత్రం నిర్ణయం తీసుకోలేనా? అనుకున్నాడేమో కానీ.. తనకు నచ్చిన అమ్మాయిని ఇంట్లో వారికి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైయిన రోజున అత్తారింట్లోనే గడిపిన అతడు.. తర్వాతి రోజు ఇంటికి వెళ్లి వస్తానని బయలుదేరాడు.
ఇంటికి వెళ్లిన భర్తకు సంబంధించిన సమాచారం ఏమీ రాకపోవటంతో భార్య మనసు కీడును శంకించింది. అందుకు తగ్గట్లే.. అతగాడు రోడ్డు పక్కన తుప్పల్లో పడి ఉండటాన్ని.. దారిన వెళుతున్న వారు గుర్తించారు. రక్తపు మడుగులో ఉన్న అతడి కాలు మీదే కాదు.. అతడి పురుషాంగాన్ని కోసి ఉన్న వైనం చూసి హడలి పోయారు. వెంటనే ఆసుపత్రి కి తరలించారు.
ఇంతకూ జరిగిందేమంటే.. ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో నూర్ ఆలం కుటుంబ సభ్యులు కోపంతో తమ వాడి మీద దాడి చేసి.. ఈ పైశాచానికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాము ఆ పని చేయలేదని వారు వాపోతున్నారు. దారి దోపిడీకి ప్రయత్నించిన దుండగులు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని చెబుతున్నారు. అయినా.. దారి దోపిడీకి పాల్పడే వారు.. మిగిలిన చోట్ల దాడి చేయొచ్చు కానీ.. టార్గెట్ చేసినట్లుగా మర్మాంగాన్ని కోసి పారేయాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుతున్నారు పోలీసులు. కారణం ఏమైనా కానీ.. ఇలా దాడి చేసి కోసి పారేసిన వైనం ఇప్పుడక్కడ సంచలనంగా మారింది.