మొన్నటి ఏపీ ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ విధానాలను, ఆయన రాజకీయంగా వేసిన అడుగులను తప్పుపట్టిన టాలీవుడ్ రచయిత కోనవెంకట్ తాజాగా తన మనసు మార్చుకున్నారు. ఎన్నికలకు ముందు జగన్ ను నిజమైన నేతగా.. చంద్రబాబును చీటర్ గా.. పవన్ ను విద్వేషిగా కోనవెంకట్ పేర్కొంటూ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.
అయితే పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల బాట పట్టడంతో కోనవెంకట్ స్వాగతించారు. తనని తాను పవన్ కు సోల్ మేట్ గా ప్రకటించుకున్నారు. ఇప్పుడు జనసేనానికే మద్దతు అని.. పవన్ సినిమాల్లోకి తిరిగి వచ్చి మంచి నిర్ణయం తీసుకున్నాడని కొనియాడారు.
పవన్ అప్పట్లో మాయవతి కాళ్లు మొక్కడం.. ఆమెను మథర్ థెరాసాగా అభివర్ణించాడాన్నిఇదే కోనవెంకట్ తప్పుపట్టారు. పవన్ రాజకీయ అడుగులను , చంద్రబాబుతో దోస్తాననాను ఎండగట్టారు. జగన్ పాదయాత్రతో ప్రజలరు చేరువ అయ్యాడని సమస్యలపై ఆయనకు అవగాహన ఉందని జగన్ కు సపోర్టు చేశాడు.
తాజా ఇంటర్వ్యూలో మాత్రం కోనా వెంకట్ జనసేనాని పవన్ కళ్యాణ్ కు పూర్తి సపోర్టుగా నిలిచారు. ‘పవన్ కు ప్రజలకు సేవ చేయాలనే గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. రాజకీయాల్లో మార్పు తీసుకు రావడానికి ఆయన ఇక్కడ ఉన్నారు. రాజకీయంగా అనుభవం లేకున్నా.. కష్ట పడుతున్నాడని’ ఫ్లేట్ ఫిరాయించాడు.
సినిమాల కాడి వదిలేసి రాజకీయాలే సర్వస్వం అన్న పవన్ ను ఇదే రచయిత కోనవెంకట్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఇప్పుడు పవన్ మళ్లీ సినిమాల బాట పట్టడం తో తనకు పనికివస్తాడని.. ఉపయోగ పడుతాడని పొగడ్తలు మొదలు పెట్టాడు. అయితే కోనవెంకట్ గతంలో తిట్టిన తిట్లను మాత్రం పవన్ కళ్యాణ్, జనసైనికులు అంత ఈజీగా మార్చిపోయే అవకాశాలు అయితే కనిపించడం లేదనడంలో ఎలాంటి సందేహం లేదు.