కరోనా చికిత్సకు డయాబెటిస్ మెట్-ఫార్మిన్

Update: 2020-07-02 16:30 GMT
కరోనా మహమ్మారిని తగ్గించే వ్యాక్సీన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే భారత్ సహా వివిధ దేశాల ఫార్మా కంపెనీలు చాలా ముందడుగు వేసాయి. హ్యూమన్ ట్రయల్స్‌కు కూడా అనుమతి వచ్చిన కంపెనీలు ఉన్నాయి. పూర్తిస్థాయి వ్యాక్సీన్ రాని నేపథ్యంలో కరోనా చికిత్సకు వివిధ రకాల డ్రగ్స్‌ను ఉపయోగిస్తున్నారు. తాజాగా డయాబెటిస్‌కు ఉపయోగింటే మెట్-ఫార్మిన్ ఉపయుక్తమని గుర్తించారు. కరోనా పుట్టిన వూహాన్‌లోని డాక్టర్ల అధ్యయనంలో ఈ డయాబెటిస్ మెడికేషన్ వైరస్‌ను తగ్గించే వండర్ డ్రగ్‌గా తేలిందట.

మెట్-ఫార్మిన్ డయాబెటిస్ టైప్ 2 ఔషధం. రక్తంలో చక్కెర లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీనిని పిసివోడి సమస్య ఉన్న మహిళలు, షుగర్ లేకుండా స్థూలకాయంతో బాధపడేవారికి కూడా ఉపయోగిస్తున్నారు. మెట్-ఫార్మిన్ మందు ఖరీదు చాలా తక్కువ. ఈ మెడిసిన్ జనరిక్ డ్రగ్ ఒక టాబ్లెట్ మూడు పైసలు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే దీనిని ఎన్‌హెచ్ఎస్ ఉపయోగిస్తోంది.

డయాబెటిస్ ఉన్నవారిలో కొంతమందికి మెట్-ఫార్మిన్‌ను ఉపయోగించారు. మరికొంతమందికి ఉపయోగించలేదు. ఈ మెడిసిన్‌ను ఉపయోగించిన వారిలో మరణాల రేటు తక్కువగా ఉంటే, ఉపయోగించని వారిలో ఎక్కువగా ఉన్నట్లు వూహాన్ వైద్యులు గుర్తించారు. మిన్నెసోటా వైద్యులు చేసిన పరిశోధనలోను ఇది వెలుగు చూసింది. కరోనా వైరస్ సంక్రమణను తగ్గించడానికి ఉపయోగపడుతుందని గుర్తించారు.

ఈ మెడిసిన్ ఖరీదు కూడా తక్కువ కాబట్టి పేద దేశాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వూహాన్‌లో పేషెంట్లకు ఇప్పటికీ దీనిని వినియోగిస్తున్నారు. కరోనా వల్ల శరీరంలో వచ్చే వాపులను ఇది తగ్గిస్తుంది. దీనిని ఉపయోగించిన వారిలో మరణాల శాతం తక్కువగా ఉంది. దీంతో పాటు మరో డ్రగ్ డెక్సా మిథసోన్‌ను కూడా ఉపయోగించవచ్చునని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతులు ఇచ్చింది.
Tags:    

Similar News