భారత్ - అమెరికా సహా వివిధ దేశాలతో చైనా కయ్యానికి కాలుదువ్వేలా వ్యవహరిస్తుందనే విషయం తెలిసిందే. అడాల్ఫ్ హిట్లర్ - చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ను పోలుస్తూ ఓ వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. 'ఒకరు కరడుగట్టిన జాతీయవాది - మరొకరు పక్కా సామ్యవాది - కానీ ఇద్దరూ నియంతలే - 20వ శతాబ్దంలో జర్మనీలో సంపూర్ణ శక్తిని పొందిన హిట్లర్ - రెండో ప్రపంచ యుద్ధాన్ని రగిలించాడని - ఇప్పుడు 21వ శతాబ్దంలో జిన్ పింగ్ విస్తరణవాద ధోరణితో ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాడని - ఇవి ఊరికే చెబుతున్న మాటలు కావని - రుజువులు చూడాలని' చెబుతూ రూపొందించిన ఈ వీడియో సంచలనంగా మారింది.
ఈ మేరకు స్ట్రాట్ న్యూస్ గ్లోబల్ అనే సంస్థ ఆగస్ట్ 1న ఈ వీడియోను పబ్లిష్ చేసింది. హిట్లర్ - జిన్ పింగ్ ఒకే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని చెబుతూ - ఇద్దరు నేతలు ఎదిగిన తీరును వివరించే ప్రయత్నం చేసింది. అధికారంలోకి వచ్చాక ఇద్దరు కూడా ఓకేలా నియంతృత్వ పోకడలు - విస్తరణవాదంతో ముందుకు సాగారని - హిట్లర్ కు జిన్ పింగ్ ఏమాత్రం తీసిపోరని పేర్కొంది. అంతేకాదు - ఇద్దరి పేర్లను కలిపేస్తూ జిన్ ప్లస్ హిట్లర్.. జిన్‌ట్లర్ అని ఈ వీడియోకు శీర్షికను పెట్టింది.
20వ శతాబ్దంలో జర్మనీలో సంపూర్ణశక్తిని కలిగిన హిట్లర్ - రెండో ప్రపంచ యుద్ధంతో చరిత్రను మార్చాడని - ఆయన మరణించిన శతాబ్దానికి చైనాలో మరో వ్యక్తి జన్మించారని - అతనే జిన్ పింగ్ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ కోర్ తానేనని - అనియంత్రిత శక్తిమంతుడిగా ఎదిగారని - విస్తరణవాదంలో ఇద్దరికీ పోలిక ఉందని తెలిపింది. 1929లో మహా సంక్షోభం తలెత్తిందని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జర్మనీలో ఉద్యోగ - ఉపాధి అవకాశాలు కల్పిస్తానని - పేదరికం పోగొడతానని హిట్లర్ అధికారాన్ని చేజిక్కించుకోగా - 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో జిన్ పింగ్ సరిగ్గా అలాగే కమ్యూనిస్ట్ పార్టీలో ఆధిపత్యాన్ని సాధించారని ఆ వీడియోలో పేర్కొన్నారు.
ఇద్దరు కూడా అధికారం చేజిక్కించుకున్న తర్వాత నియంతృత్వ - విస్తరణవాదంతో ముందుకు సాగారని పేర్కొంది. 1933లో జర్మన్ ఛాన్సులర్ గా బాధ్యతలు చేపట్టిన హిట్లర్ ఏడాదిలోగా మహానేతగా ఎదిగారని - 2008లో పగ్గాలు చేపట్టిన జిన్ పింగ్ నాలుగేళ్ల వ్యవధిలో అలాగే ఎదిగారని తెలిపారు. సొంత పార్టీ మొదలు.. ఎవరు ప్రశ్నించినా ఈ ఇద్దరు నేతలు వారిని తుదముట్టించారని పేర్కొన్నారు. అయితే హిట్లర్ వారిని అంతం చేస్తే - జిన్ పింగ్ జైలుపాలు చేశారని వీడియోలో పేర్కొన్నారు.
నాడు హిట్లర్ - నేడు జిన్ పింగ్.. చాలా రహస్యంగా సంపత్తిని పెంచుకోవడం - వినూత్న - వ్యూహాత్మక పద్ధతులు అవలంభిస్తూ తమకు ఎవరూ సాటిలేరనే తీరుతో వ్యవహరించారని, నాడు హిట్లర్ జర్మన్ నేవీని బ్రిటన్ కు ధీటుగా నిలబెడితే - 2030 నాటికి చైనా నౌకాదళ బలాన్ని అమెరికాను తలదన్నేస్థాయికి చేరేలా జిన్ పింగ్ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నాడు జర్మనీలో హిట్లర్ - నేడు చైనాలో జిన్ పింగ్ కోర్ అనే భావన నాటుకు పోయిందని పేర్కొన్నారు.
ఓ వైపు అంతర్జాతీయ ఒప్పందాలు గౌరవిస్తామంటూనే ఇద్దరు కూడా విస్తరణవాదంతో పొరుగుదేశాలపై దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. జర్మన్లు నివసించే ప్రాంతాలు తమవని నాడు హిట్లర్ చెప్పగా - నేడు జిన్ పింగ్ చుట్టుపక్కల దేశాల భూభాగాలు తమవేననే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ఆస్ట్రియా - పోలాండ్ దేశాలను జర్మనీలో విలీనం చేసుకోవడానికి నాడు హిట్లర్ ప్రయత్నాలు చేశాడని - ఇప్పుడు తైవాన్ - హాంగ్ కాంగ్ - దక్షిణ చైనా సముద్రంలోని దీవుల్ని కలిపేసుకునేందుకు జిన్ పింగ్ విస్తరణవాదంతో ఊగిపోతున్నారని అభిప్రాయపడ్డారు. 1939లో పోలెండ్ పైకి కుంటిసాకుతో దాడికి దిగాడని - 2020లో జిన్ పింగ్ భారత్ పైకి ఉసిగొల్పాడని ఆ వీడియోలో పేర్కొన్నారు. నాడు హిట్లర్ వినాశనానికి కారణం కాగా - నేడు ఆ పాత్రను జిన్ పింగ్ పోషిస్తున్నారని పేర్కొనడం గమనార్హం. కాగా, ఈ వీడియోపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియోను తొలగించాలని ఇండియాలోని చైనీస్ ఎంబసీ హెచ్చరించింది.
Full View