డ్రోన్ కెమెరాల్లో యాదాద్రి వైభవం.. చూస్తే కళ్లు చాలవు

Update: 2021-11-04 04:58 GMT
యాదాద్రి.. తెలంగాణకే కాదు.. యావత్ దేశానికి ఆదర్శంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారు. ప్రభుత్వం వందల కోట్లు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తోంది. కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో క్షేత్రం వడివడిగా ముస్తాబవుతోంది.

తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా చోళ, కాకతీయ, పల్లవ శిల్ప కళాకృతుల సమ్మేళనంతో ఈ పవిత్ర పుణ్యక్షేత్రం రూపుదిద్దుకుంటోంది. యాదాద్రిని తెలంగాణ ఆధ్యాత్మిక రాజధానిగా మార్చాలని కేసీఆర్ పట్టుదలగా పూర్తి చేస్తున్నారు.  అందుకే ఆలయ  పునరుద్ధరణ కోసం ఏకంగా రూ.600 కోట్లు వెచ్చిస్తున్నారు. తెలంగాణలోనే గొప్ప ఆలయంగా యాదాద్రిని తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఈ మేరకు తరచూ పర్యటిస్తూ అక్కడి పనులను వేగవంతంగా చేస్తున్నారు.  యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయంపై తెలంగాణ సీఎం కెసిఆర్ కోట్లు ఖర్చు పెడుతున్నారు.

తెలంగాణ సర్కార్ యాదాద్రి ఆలయ అభివృద్ధిని ఎలా చేస్తుందో తెలిపేలా తాజాగా డ్రోన్లతో తీసిన ఒక వీడియో వైరల్ గా మారింది. రింగ్ రోడ్, పచ్చదనం మరియు కొత్తగా పునరుద్ధరించిన ఆలయం..  లోపల ఆలయ భాగం.. విగ్రహాలు, శిల్పకళా వైభవం ఎలా ఉందో  ఈ డ్రోన్ కెమెరాల్లో పంచుకున్నారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

ఈ వీడియో చూస్తే   నిజంగా రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధానిగా యాదాద్రి ఖ్యాతికి ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.యాదాద్రిలో అన్ని పనులు పూర్తయిన తర్వాత సీఎం కేసిఆర్ దేశంలోని ప్రముఖ స్వామీజీలందరితో ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించి ఆలయాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది.

2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ తర్వాత భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. ఈ క్రమంలోనే యాదాద్రిపై తాజాగా పర్యాటక శాఖ వీడియోను విడుదల చేసింది. డ్రోన్ కెమెరాలతో తీసిన ఈ దృశ్యాలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. ఈ అద్భుత వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

https://twitter.com/Imcckr/status/1455741606888296455?s=20
Tags:    

Similar News