య‌న‌మ‌ల మాట‌!..క‌మ‌లంతో క‌య్య‌మెందుకు?

Update: 2018-02-02 11:01 GMT
కేంద్ర బ‌డ్జెట్ లో ఎప్ప‌టిలానే ఈ సారి కూడా తెలుగు నేల‌కు... ప్ర‌త్యేకించి ఆర్థిక ఇబ్బందుల‌తో కొట్టుమిట్టాడుతున్న న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ కు మొండి చెయ్యే ద‌ర్శ‌న‌మిచ్చింది. గ‌డ‌చిన బ‌డ్జెట్‌ ల‌లో క‌నీసం కొన్ని అంశాల‌కైనా కాస్తంత చెప్పుకోద‌గ్గ మేర నిధులు కేటాయించిన న‌రేంద్ర మోదీ స‌ర్కారు... ఈ ద‌ఫా మరింత దారుణంగా వ్య‌వ‌హరించింద‌నే చెప్పాలి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నిన్న పార్ల‌మెంటులో చేసిన బ‌డ్జెట్ ప్ర‌సంగంలో అస‌లు తెలుగు నేల మాటే వినిపించ‌లేదు. అయితే బ‌డ్జెట‌రీ కేటాయింపుల్లో ఏవో కొన్ని సంస్థ‌ల‌కు అర‌కొర నిధుల‌ను కేటాయించిన‌ట్లుగా బ‌డ్జెట్ కాపీల‌ను చూస్తే అర్థ‌మైపోయింది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు న‌రేంద్ర మోదీ స‌ర్కారు ప్ర‌వేశ‌పెడుతున్న చివ‌రి బ‌డ్జెట్ అయిన 2018-19 బ‌డ్జెట్‌ లో మిగిలిన రాష్ట్రాల కంటే కూడా తెలుగు రాష్ట్రాల‌కు... ప్ర‌త్యేకించి ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ఎంతో కొంత న్యాయం జ‌రుగుతుంద‌ని అంద‌రూ ఆశించారు. అయితే ఆ ఆశ‌ల‌ను అడియాశ‌లు చేస్తూ జైట్లీ తెలుగు నేల పేరెత్త‌లేదు క‌దా... క‌నీసం కేటాయింపుల్లోనూ పెద్దగా చేసిందేమీ లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. త‌న మిత్ర‌ప‌క్షం టీడీపీ పాల‌న‌లో ఉన్న ఏపీకే మొండి చెయ్యి చూపిన మోదీ... నిధుల విష‌యంలో కేంద్రం వ‌ద్ద మోక‌రిల్ల‌ని ఉత్త‌రాది రాష్ట్రాల‌కు మాత్రం ఘ‌నంగానే కేటాయింపులు చేశారు.

వెర‌సి తెలుగు నేల‌తో త‌మ‌కు ఏమాత్రం ప‌నిలేద‌న్న రీతిలోనే మోదీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రించింద‌న్న వాద‌న లేక‌పోలేదు. దీంతో జైట్లీ బ‌డ్జెట్ ప్ర‌సంగం ముగియ‌గానే... త‌న కార్య‌క్ర‌మాల‌న్ని ర‌ద్దు చేసుకున్న టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... పార్టీ ఎంపీల‌తో ప్ర‌త్యేకంగా టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు, రాష్ట్రానికి న్యాయం చేసేలా కేంద్రంపై మ‌రింత ఒత్తిడి పెంచాల‌ని - స్వ‌రం కూడా పెంచాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఆ త‌ర్వాత అందుబాటులో ఉన్న త‌న కేబినెట్ మంత్రుల‌తో ఆయ‌న ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు... మిత్ర‌ప‌క్షం పార్టీ ప్ర‌భుత్వం ఉన్న రాష్ట్రమ‌న్న భావ‌న కూడా లేకుండా ఏపీకి కేంద్రంలోని మోదీ స‌ర్కారు ఏం చేసింద‌ని ఒకింత ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేశారు. ఆది నుంచి ఇలాగే జ‌రుగుతున్నా... చివ‌రి బడ్జెట్‌ లోనూ మోదీ స‌ర్కారు సానుకూలంగా స్పందించ‌కుంటే... బీజేపీతో పొత్తు ఎలా కొన‌సాగించేద‌ని కూడా ఆయ‌న చాలా ఘాటు వ్యాఖ్య‌లే చేసిన‌ట్లుగా కూడా తెలుస్తోంది. బాబు మాదిరే ఇత‌ర మంత్రులు కూడా బీజేపీ స‌ర్కారుపై అంతెత్తున లేవ‌గా... బాబు కేబినెట్‌ లో కీల‌క మంత్రిగానే కాకుండా ఆర్థిక శాఖ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్న టీడీపీ సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మాత్రం వారికి భిన్నంగానే వ్య‌వ‌హ‌రించార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

*అయినా ఇప్పుడు ఏం కొంప‌లు మునిగిపోయాయ‌ని బీజేపీతో తెగ‌దెంపుల దిశ‌గా వెళ్లాల‌ని కూడా య‌న‌మ‌ల... బాబునే ప్ర‌శ్నించార‌ట‌. అయినా ఇప్పుడు జ‌రిగింది కేంద్ర బ‌డ్జెట్ ను పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్ట‌డం మాత్ర‌మే క‌దా. ఇంకా బ‌డ్జెట్ కేటాయింపులు చాలానే ఉంటాయి. వాటిలో మ‌న‌కు న్యాయం జ‌రిగిలే బీజేపీతో సంప్ర‌దింపులు జ‌రుపుదాం. బడ్జెట్ ప్ర‌సంగంలో మ‌న మాట లేకున్నా.... బ‌డ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి బీజేపీ స‌ర్కారు న్యాయం చేస్తుంద‌ని భావిస్తున్నాను. మ‌రింత కాలం పాటు వెయిట్ చేద్దాం* అని త‌న మ‌న‌సులోని మాట‌ను య‌న‌మ‌ల స‌మావేశంలో బ‌య‌ట‌పెట్టార‌ట‌. య‌న‌మ‌ల వ్యాఖ్య‌ల‌తో కాస్తంత షాక్‌ కు గురైన చంద్ర‌బాబు... ఇంకా వెయిట్ చేస్తే ప్ర‌జ‌ల్లో మ‌నం చుల‌క‌న కామా? అని కూడా ప్ర‌శ్నించార‌ట‌. అయినా కూడా త‌న వాద‌న‌కే కట్టుబ‌డి ఉన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన య‌న‌మ‌ల... *ఇన్నాళ్లు వెయిట్ చేశాం. ఇంకో ఆరు నెల‌లో - ఏడాదో వెయిట్ చేస్తే త‌ప్పేంటీ? అయినా బీజేపీ మన‌సులో ఏముందో తెలుసుకోకుండా ముంద‌డుగు వేస్తే ఎలా?  చూద్దాం... ఎన్నిక‌ల్లోగా బీజేపీ మ‌న‌కు ఏం చేస్తుందో?* అని కూడా ఎదురు ప్ర‌శ్నించార‌ట‌. మొత్తానికి నిన్న వాడీవేడీగా జ‌రిగిన భేటీలో చంద్ర‌బాబు భావ‌న‌కు వ్య‌తిరేకంగా... బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేసిన య‌న‌మ‌ల టీడీపీలో ఓ పెద్ద చ‌ర్చ‌కే తెర తీశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News