ఏపీ రాజధాని కోసం భూములు ఇవ్వమంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతుల్ని పరామర్శించుకోవటానికి ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ అధికార పక్షంపై సటైర్లు వేసిన పవన్ కల్యాణ్.. రాజధాని ప్రాంతంలో భూమిని లాక్కోవ్దని.. ఏపీ సర్కారుకు తాను చెబుతున్నానంటూ ‘‘హెచ్చరిక’’ను తనదైన శైలిలో చెప్పటం తెలిసిందే.
పవన్ కల్యాణ్ చెప్పాల్సింది చెప్పేశాడు. పెనుమాక.. ఉండవల్లి తో సహా భూసేకరణకు.. భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్న వారి వద్ద నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి సేకరించొద్దని. ఇక.. నిర్ణయం ఏపీ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. అయితే.. ఇలాంటి పరిస్థితికి ఎవరు కారణం? ఇంతకాలం కామ్ గా ఉంటూ.. పరిస్థితులను చూస్తూ సమయం కోసం ఎదురు చూసిన పవన్ కల్యాణ్ ను.. బయటకు తీసుకొచ్చి.. రైతులను కలిసి.. ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చేలా చేసింది ఎవరన్న విషయాన్ని వెతికితే.. ఆశ్చర్యకరమైన సమాధానం రావటం ఖాయం.
ఏపీ ఆర్థికమంత్రి యనమల చేసిన వ్యాఖ్య కే పవన్ పర్యటన ఖరారు అయ్యిందని చెబుతున్నారు. యనమల వ్యాఖ్యకు ముందు వరకూ.. మర్యాదగా.. బాధ్యతగా ట్వీట్ చేస్తూ.. ప్రభుత్వానికి తన మాటను వినిపిస్తున్న పవన్ ట్వీట్స్ ను కెలికి.. ఎటకారంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పవన్ పర్యటన చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ రోజు పవన్ కల్యాణ్ పుణ్యమా అని.. రాజధాని భూసేకరణ విషయంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితి. దీనికి అధికారపక్షానికి చెందిన సీనియర్ నేత అనాలోచితంగా చేసిన వ్యాఖ్యే కారణం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.