ప‌వ‌న్‌ పై టీడీపీ పంచ్‌ లు స్టార్ట్‌...య‌న‌మ‌ల పంచ్‌

Update: 2015-08-19 08:20 GMT
రాజ‌ధాని భూసేక‌ర‌ణ వ్య‌వ‌హారం జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య గ్యాప్ పెంచుతోంది. బ‌ల‌వంత‌పు భూసేక‌ర‌ణ వ్య‌తిరేకిస్తూ ప‌వ‌ర్‌ స్టార్ గ‌త వారం రోజుల్లో మూడోసారి ట్వీట్లు చేశారు. బుధ‌వారం ప‌వ‌న్ కాస్త సీరియ‌స్‌ గానే అభివృద్ధి పేరుతో త‌క్కువ న‌ష్టం చేసేవారే వివేక‌వంత‌మైన పాల‌కుల‌వుతార‌ని కూడా ఏపీ ప్ర‌భుత్వానికి పంచ్ విసిరారు. అలాగే తాను బ‌ల‌వంత‌పు భూసేక‌రణ వ్య‌తిరిక‌స్తున్నాన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.

 ప‌వ‌న్ ట్విట్ చేసిన కొద్దిసేప‌టికే ఏపీ ఆర్థిక‌శాఖా మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కూడా దీనిపై స్పందించారు. ప‌వ‌న్ మాట‌ల‌కు పంచింగ్ ప్ర‌శ్న‌లను విసిరి కాస్త సెటైరిక‌ల్‌ గా రిప్లేగా ఇచ్చారు. రాజ‌ధానిలో ఇప్ప‌టికే వేలాది ఎక‌రాల భూసేక‌ర‌ణ జ‌రిగింద‌ని...చాలా త‌క్కువ గ్రామాల రైతులు మాత్ర‌మే భూసేక‌ర‌ణ వ్య‌తిరేకిస్తున్నందున ఏం చేయాల‌నేదానిపై తాము చ‌ర్చిస్తున్న‌ట్టు చెప్పారు.

 భూసేక‌ర‌ణ చ‌ట్టం ద్వారా భూములు సేక‌రించ‌వ‌ద్ద‌ని చెపుతున్న ప‌వ‌న్ ఎలాంటి భూములు సేక‌రించాలో కూడా చెపితే మంచిద‌న్నారు. ఇక బీహార్ ప్యాకేజీ ని ఏపీతో పోల్చ‌డం స‌రికాద‌న్నారు. ఏపీ రెవెన్యూ లోటును మొత్తం కేంద్ర‌మే భ‌ర్తీ చేయాల‌ని..అలాగే 25 ల‌క్ష‌ల కోట్ల‌ తో కేంద్రానికి ప్రతిపాద‌న‌లు స‌మ‌ర్పించామ‌ని య‌న‌మ‌ల తెలిపారు. ఇక ప్ర‌త్యేక హోదా కేంద్రం పార్ల‌మెంటులో ఇచ్చిన హామీయే అన్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

 ఏదేమైనా బ‌ల‌వంత‌పు భూసేక‌ర‌ణ‌పై ప‌వ‌న్ కూడా వెన‌క్కిత‌గ్గేలా లేడు. ఇక 21 త‌ర్వాత భూసేక‌ర‌ణ చ‌ట్టం ద్వారా భూమి సేక‌రించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం డిసైడైంది. ప‌వ‌న్ టీడీపీ తో ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా...టీడీపీ కూడా ప‌వ‌న్‌ కు గ‌ట్టిగా రిప్లే ఇవ్వ‌కుండా..మెత‌క వైఖ‌రితో ఉంటే క‌ష్ట‌మ‌ని భావించి నెమ్మ‌ది నెమ్మ‌దిగా జ‌న‌సేనానిపై స్వ‌రం పెంచుతోంది. టీడీపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో అటు బీజేపీ పై పోరాటం చేయ‌డంతో పాటు ఇటు భూసేక‌ర‌ణ విష‌యంలో జ‌న‌సేన‌ కు స‌మాధానం చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.
Tags:    

Similar News