గంటా వెంబడి ఇద్దరు ఎమ్మెల్యేలు.. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు జంపా?

Update: 2020-08-08 12:30 GMT
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాకను వైసీపీలో చాలా మందే వ్యతిరేకిస్తున్నారట.. అయినా గంటాను ఎంత మంది వద్దు అన్నా వైసీపీ హైకమాండ్ మాత్రం చేర్పించుకోవడానికి రెడీ అవుతుండడం విశేషంగా మారింది.

దీనికి కారణంపై ఆరాతీయగా ఆసక్తికర విషయం వెలుగుచూసింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలనుకున్న వైసీపీ ప్రభుత్వానికి అక్కడ అంతా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని.. దీంతో వైసీపీ పరిపాలనకు ఇబ్బందులు తలెత్తుతాయని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే అక్కడ టీడీపీని బలహీన పరచాలని.. నలుగురు విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలకు గాలం వేయాలని చూస్తోందట.. ఈ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను చీల్చి పట్టు సాధించాలనే పట్టుదలతోనే ఇంతమంది వ్యతిరేకిస్తున్నా గంటాను వైసీపీలోకి చేర్చుకుంటున్నారనే టాక్ వైసీపీ వర్గాల్లో నడుస్తోంది.

గంటా వెంట ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు.. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. వైసీపీలోకి జంప్ చేసే టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే గణేష్ అని.. ఇంకొక ఎమ్మెల్యే పేరు బయటికి రావడం లేదు. ఇక మాజీ ఎమ్మెల్యేల్లో రమేశ్ బాబు, ఇంకొక ఇద్దరు తూర్పు గోదావరి కాపు వర్గం నుంచి వైసీపీలోకి గంటాతోపాటు చేరుతున్నారని ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News