బద్వేల్ లో వైసీపీ బంపర్ విక్టరీ : సీఎం జగన్ రికార్డ్ బ్రేక్

Update: 2021-11-02 09:34 GMT
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించడంతో క‌డ‌ప‌ జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. అధికార ప‌క్షం.. ఆన‌వాయితీ సెంటిమెంట్ ప్రకారం వైసీపీ బద్వేలు టికెట్ ను డాక్టర్ వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధకు ఇచ్చింది. ప్రధాన ప్రతిప‌క్షం తెలుగు దేశం ఈ ఎన్నిక‌లో పాల్గొన‌డం లేద‌ని స్పష్టం చేసింది. తొలుత పాల్గొనాల‌ని భావించినా సెంటిమెంట్‌, ఆన‌వాయితీని పాటించాల‌ని నిర్ణయం తీసుకొంది. అంతే కాకండా గ‌త ఎన్నిక‌ల్లో ఎక్కువ‌గా ప్రభావం చూపుకున్నా.. ప్రతిప‌క్షంలా ప్రశ్నిస్తామంటూ నిరంతం ప్రజ‌ల్లో ఉండే ప్రయ‌త్నం చేస్తున్న జ‌న‌సేన కూడా పోటీ నుంచి త‌ప్పుకొంది.

అయితే ఎన్నిక‌ల్లో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ పోటీ చేశాయి. ఏకగ్రీవం అవుతుందనుకున్న బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక… BJP పోటీకి దిగడంతో రసవత్తరంగా మారింది. 2019 ఎన్నికల్లో YCP అభ్యర్ధిగా డాక్టర్ వెంకటసుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయితే ఆయన అకాల మరణంతో ఉపఎన్నిక రావడంతో …ఏకగ్రీవం చేయాలని పిలుపునిచ్చింది వైసీపీ. ఇందుకు జనసేన, టీడీపీ పోటీకి దూరంగా ఉంటే…గత ఎన్నికల్లో కేవలం 735 ఓట్లు మాత్రమే వచ్చిన బీజేపీ మాత్రం అభ్యర్దిని బరిలోకి దింపింది. 13 వ రౌండ్లో వైఎస్సార్‌సీపీకి 362 ఓట్లు, బీజేపీకి 40 ఓట్లు, కాంగ్రెస్‌కు 12 ఓట్లు పోల్‌ అయ్యాయి. మొత్తంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ 90,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ కి 90,110 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆ రికార్డును సుధ బ్రేక్ చేసింది. ఇప్పటికే 11 రౌండ్ల ఫలితం వెలువడింది. 11వ రౌండ్లో మొత్తం ఓట్లు 6688 ఉంటే.. వైసీపీ కి 5139 ఓట్లు, బీజేపీ 984 ఓట్లు, కాంగ్రెస్ 223 ఓట్లు వచ్చాయి. దీంతో ఓవరాల్ గా 11వ రౌండ్ ఫలితం ముగిసే సరికి వైఎస్సార్‌సీపీ 90,089 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అన్ని రౌండ్లలో కలిపి వైఎస్సార్‌సీపీ 1,11,227 ఓట్లు సాధించగా.. బీజేపీ 21,577, కాంగ్రెస్‌ 6223 ఓట్లు సాధించింది.

మొత్తం ఓట్లు 1,46,545 ఉండ‌గా, వాటిలో వైసీపీ అభ్య‌ర్థికి రికార్డు స్థాయిలో 1,12,072 ఓట్లు ప‌డ్డాయి. బీజేపీ అభ్య‌ర్థికి 21,661 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థికి 6,217, నోటాకు 3,629 ఓట్లు పోల‌య్యాయి. ఈ ఉప ఎన్నికలో అత్య‌ధిక మెజార్టీ సాధించి వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ దాస‌రి సుధ.. వైఎస్ జ‌గ‌న్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టారు. సుధ 90,411 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ 90,110 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విష‌యం తెలిసిందే. దీంతో జ‌గ‌న్ రికార్డును సుధ ఇప్పుడు అధిగ‌మించారు.
Tags:    

Similar News