స్థానిక ఎఫెక్ట్‌: భేష‌జాలు వీడితే.. ప‌వ‌న్‌ - బాబుల‌కే ప‌ట్టం!

Update: 2021-03-18 03:00 GMT
స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే.. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేసింది. ఇది పైకి క‌నిపిస్తున్న వాస్త‌వం. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహం లేదు. అయితే.. వైసీపీకి ఇది ఎలా సాధ్య‌మైంది? అనేది మాత్రం ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో జ‌గ‌న్‌ పై సానుభూతితో పాటు.. ఇత‌ర పార్టీల మ‌ధ్య‌.. ముఖ్యంగా పొత్తు పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త లోపించిన కార‌ణంగా.. మ‌రో ప్ర‌త్యామ్నాయం లేక పోవ‌డం కావొచ్చు.. లేదా.. మ‌రేదైనా కార‌ణం కావొచ్చు.. వైసీపీ వైపు ప్ర‌జ‌లు నిల‌బడ్డార ‌నేది వాస్త‌వం. కానీ, ఓట్ షేరింగ్ చూసిన‌ప్పుడు మాత్రం.. టీడీపీ-జన‌సేన‌ల‌కు వ‌చ్చిన ఓటింగ్‌ను క‌లుపుకొంటే.. వైసీపీకి త‌క్కువ ‌గానే వ‌చ్చింది.

అంటే.. రాష్ట్రంలో మ‌ళ్లీ 2014 సీన్ క‌నుక రిపీట్ అయితే.. ఇటు టీడీపీకి - అటు జ‌న‌సేన‌కు కూడా ఉభ‌య కుశ‌లోప‌రిగా ఉంటుంద ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. అంటే.. ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలి పోయి.. జ‌న‌సేన‌కు ప‌డింద‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. అదేస‌మ‌యంలో.. టీడీపీ ఓట్లు కూడా జ‌న‌సేన‌కు ప‌డ్డాయ‌ని కొంద‌రు చెబుతున్నారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని అంచ‌నా వేస్తే.. కృష్ణా జిల్లాలో వైసీపీ - టీడీపీ మధ్య లక్ష ఓట్ల తేడా ఉంది. ఈ జిల్లాలో జనసేనకు 50 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. రెండుపార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ఫలితం తారుమారయ్యేదని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

విశాఖ విష‌యానికి వ‌స్తే.. వైసీపీ 4.64 లక్షల ఓట్లు సాధించింది. టీడీపీ 3.87 లక్షల ఓట్లు తెచ్చుకుంది. జనసేనకు 82 వేలు దక్కాయి. అంటే... ఈ రెండు పార్టీల ఓట్లను కలిపితే... వైసీపీకంటే ఎక్కువే అవుతాయి. ఇలా.. కోస్తాంధ్ర‌ - ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో టీడీపీ-జ‌నసేన‌ల మ‌ధ్య చీలిన ఓట్లు.. వైసీపికి ప్ల‌స్ అయ్యాయి. అలా కాకుండా.. ఈ రెండు పార్టీలూ క‌నుక క‌లిసి పోటీ చేస్తే.. ఫ‌లితం భిన్నంగా ఉండేద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో తిరిగి 2014 ఫార్ములా (అప్ప‌ట్లో జ‌న‌సేన పోటీ చేయ‌లేదు. టీడీపీకి మ‌ద్ద‌తిచ్చింది) తెర‌మీదికి తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది విశ్లేష‌కుల భావ‌న‌. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు..

సో.. ఎప్ప‌టి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా అప్ప‌టికి మార్పులు చేసుకోవ‌డం అటు జాతీయ రాజ‌కీయాల్లోనూ కామ‌నే అయిన‌ప్పుడు.. రాష్ట్రాల్లోనూ స‌హ‌జ‌మే. ఈ విష‌యంలో అటు జ‌న‌సేన‌ - ఇటు టీడీపీలు భేష‌జాలు వీడి.. రాజ‌కీయంగా పురోగ‌తిపై దృష్టి పెడితే.. క‌లిసి ముందుకు సాగ‌డం అనేది పెద్ద క‌ష్ట‌మైన ప‌నికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఈ క‌ల‌యిక ఏదో ఎఎన్నిక‌ల‌కు ముందు కాకుండా.. క‌నీసం ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందునుంచైనా ఉంటే.. ప్ర‌జ‌ల్లో ఒక మంచి సంకేతం ప‌పించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు స‌హా.. పార్టీల‌కు మేలు జ‌రుగుతుంద‌ని సూచిస్తున్నారు.
Tags:    

Similar News