జడ్జిలను తిట్టేసి జైలుకు వెళ్లిన వైసీపీ ఫాలోవర్ షాకింగ్ వ్యాఖ్యలు విన్నారా?

Update: 2023-01-17 09:35 GMT
దేశ రాజకీయాల్ని పక్కన పెడదాం. దేశంలో మరే రాష్ట్రాల్లో లేని రీతిలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఒక రేంజ్ లో ఉండటం తెలిసిందే. ఇక.. ఏపీ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎక్కడా లేని రీతిలో చిత్ర విచిత్రమైన పద్దతుల్లో తాము అభిమానించే వారిని ఆకాశానికి ఎత్తేయటం.. తాము వ్యతిరేకించే వారి విషయంలో ఎలాంటి విషపు ప్రచారం చేయాలన్న దానిపై జరిగే కుట్రలకు సంబంధించిన ఒక కొత్త విషయం బయటకు వచ్చింది.

ఆ మధ్యన ఏపీ హైకోర్టు జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం.. వారికి కులాల్ని అంటగట్టటం.. వారంతా 'ప్రభావితం' అవుతున్నారంటూ మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో వైసీపీకి చెందిన సానుభూతిపరులు పెద్ద ఎత్తున ప్రచారానికి దిగటం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ తీరుపై న్యాయస్థానం సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి.

అలా న్యాయమూర్తులను ఎడాపెడా విమర్శలు చేసేసినోళ్లు.. దూషించినోళ్లకు సంబంధించి కొందరు హద్దులు దాటేసిన వారిని పోలీసులు తప్పనిసరి పరిస్థుల్లో అరెస్టు చేయటం.. నెలల తరబడి జైల్లో మగ్గిపోవాల్సి రావటం తెలిసిందే.

అలా జడ్జిలను దూషించిన కేసులో గుంటూరు జైల్లో మూడు నెలల పాటు జైల్లో గడిపిన వైసీపీ స్ట్రాంగ్ ఫాలోయర్ యూట్యూబ్ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వటం.. దానికి సంబంధించిన వీడియోక్లిప్ ఒకటి వైరల్ గా మారింది. అందులో తాము తప్పుదారి పట్టేసే విధానం.. అదెలా జరుగుతుందన్న విషయంతో పాటు.. వైసీపీకి చెందిన మీడియా సంస్థల ప్రభావం తన లాంటి వారి మీద ఎంత ఉంటుందన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేశారు.

రాజకీయంగా తాము విభేదించే చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ప్రత్యేకమైన కంటెంట్ అవసరమవుతుందని.. అలాంటి వాటిని సాక్షి మీడియా సంస్థ నుంచి ఎలా అందిపుచ్చుకుంటామేమో చెప్పుకొచ్చారు. దాదాపు మూడున్నర నిమిషాలకు పైనే ఉన్న ఈ వీడియోలోని అంశాల్ని ఇట్టే చెప్పేస్తాయి.

ఇదంతా చూసిన తర్వాత ఇంత దారుణంగా పరిస్థితులు ఏపీలోనే ఎందుకు ఉంటాయన్న అంశంతో పాటు.. ఎంత రాజకీయ అంశమైనా సరే.. వాటిని ఎలా పక్కదారి పట్టిస్తారన్న దానికి నిదర్శనంగా తాజా వీడియోనే ఆధారమంటున్నారు. మరెందుకింత ఆలస్యం.. ఆ వీడియోను చూసేస్తేయ పోలా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News