వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కేబినెట్లోకి చేరడం గురించి వార్తలు రావడం కొత్త ఏమీ కాదు. సెంట్రల్లో మోడీ కేబినెట్ రెండో సారి ఏర్పడినప్పుడే ఆ వార్తలు వచ్చాయి. కేంద్రంలో పరిపూర్ణమైన మెజారిటీతో మోడీ సర్కారు ఏర్పడినప్పటికీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా కమలం వాళ్లు కలుపుకుపోతారని, ఆ పార్టీని కూడా కేబినెట్లోకి తీసుకుంటారని అప్పట్లో ప్రచారం జరిగింది.
అయితే ఏమైందో ఏమో కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆ సంగతలా ఉంటే.. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలు ఆరు నెలలను పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి అదే మాటే వినిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో భాగస్వామిగా చేసుకోబోతోందట మోడీ సర్కారు. అందుకు సంబంధించి చర్చలు సాగుతూ ఉన్నాయని సమాచారం.
ఇటీవల వైసీపీ ఎంపీ ఒకరు ఢిల్లీలో ఇచ్చిన విందు సందర్భంగా కూడా ఆ చర్చలే సాగాయని సమాచారం. అంతా ఓకే అయిపోయిందని.. కేంద్రంలో విజయసాయి రెడ్డితో పాటు.. మరొకరికి మంత్రి పదవి కూడా ఖరారు అయినట్టే
అనేది లేటెస్ట్ గాసిప్. రెండో మంత్రి పదవికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. దళిత లేదా కాపు లేదా కాపు మహిళను రెఫర్ చేయనున్నట్టుగా ప్రచారం సాగుతూ ఉంది.
అయితే ఈ ప్రచారానికి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ మాత్రమే. గాసిప్ లాంటిదే. అయితే దీనికి పలు లాజిక్ లున్నాయి. వాటిల్లో ఒకటి.. ఇటీవలే బీజేపీకి శివసేన దూరం కావడం. ఎన్డీయే నుంచి శివసేన బయటకు వెళ్లిపోయింది. లోక్ సభలో, రాజ్యసభలో శివసేనకు బలం ఉంది. బీజేపీ వాళ్లు వీలైనంతగా మిత్రపక్షాలను కలుపుకునేందుకే ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. కాంగ్రెస్ యేతర పార్టీలతో వీలైనంతగా స్నేహం చేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక వైసీపీ కూడా బీజేపీతో సత్సంబంధాలను కోరుకుంటూ ఉంది.
రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కూడా కమలం పార్టీ సహకారం అవసరం. ఈ నేపథ్యంలో.. ఎన్డీయేలో వైసీపీ చేరడం మరీ అంత విడ్డూరమైన అంశం ఏమీ కాదు. కాబట్టి ఇందుకు చాలా పాజిబులిటీ కనిపిస్తూ ఉంది.