ఎంవీవీకి సెగ పెడుతున్న వైసీపీ కీల‌క నేత‌.. నిజ‌మేనా?

Update: 2022-01-24 04:15 GMT
రాజ‌కీయాలు ఎక్క‌డైనా రాజ‌కీయాలే!  గ‌తంలో ఎక్క‌డైనా బావే కానీ.. వంగ‌తోట కాడ మాత్రం కాద‌న్న‌ట్టుగా.. రాజ‌కీయాల్లో సొంత పార్టీ నేత‌లే అయినా.. అవ‌కాశం .. అవ‌స‌రం.. వ‌స్తే.. నాయ‌కులు ఎవ‌రినైనా లెక్క‌చేయ‌రు. సొంత ఇంట్లో బంధువుల‌ను కూడా లెక్క‌చేయ‌ని ప‌రిస్థితిని మ‌నం చూశాం. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే వైసీపీలోనూ క‌నిపిస్తోంది. పార్టీ కీల‌క నాయ‌కు డు, సినీ నిర్మాత‌, ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌.. ఎంవీవీ స‌త్య నారాయ‌ణ‌కు సొంత పార్టీ నేతే.. సెగ పెడుతున్నార‌ట‌. గ‌త 2019 ఎన్నిక‌ల్లో అనూహ్యంగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌.. విశాఖ ప‌ట్నం ఎంపీ సీటును ద‌క్కించుకున్నారు.

వాస్త‌వానికి ఆయ‌న అదే ఆయ‌న‌కు రాజ‌కీయంగా తొలి అడుగు. ఎవ‌రినీ నోరు విప్పి విమ‌ర్శించ‌లేరు. బ‌హిరంగ స‌భ‌ల్లో ఎలా మాట్లాడాలో కూడా తెలియ‌ని నాయ‌కుడు(ఇదే విష‌యాన్ని అప్ప‌ట్లో ఎంవీవీని విశాఖ ప్ర‌జ‌లకు ప‌రిచ‌యం చేస్తూ.. వైసీపీ అధినేత జ‌గ‌న్ చెప్పుకొచ్చారు) రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వైసీపీ సునామీ కావొచ్చు.. జ‌గ‌న్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్న పిలుపు కావొచ్చు... మొత్తానికి విశాఖ‌లో ఎంవీవీ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఉత్త‌రాంద్ర జిల్లాల వైసీపీ నాయ‌కుడు.. విజ‌య సాయిరెడ్డి దూకుడు ఎక్కువ‌గా ఉన్న విష‌యం తెలిసిందే. జిల్లాల‌పై ప‌ట్టు పెంచుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు.

విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అన్నీతానై వ్య‌వ‌హ‌రించారు. పాద‌యాత్ర కూడా చేశారు. ఇక‌, విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌రిం చ‌కుండా ఇక్క‌డి ఉద్యోగులు చేస్తున్న ఆందోళ‌న‌కు కూడా సాయిరెడ్డి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీంతో విశాఖ‌లో ఎటు చూసినా.. ఎంపీ పేరు కాకుండా.. సాయిరెడ్డి పేరు వినిపించ‌డం ప్రారంభ‌మైంది. దీనిని మొద‌ట్లో ఎంవీవీ ప‌ట్టించుకోలేదు. కానీ.. తాజాగా రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం కోల్పోతున్న సాయిరెడ్డి.. ఈ ద‌ఫా త‌న‌కు రాజ్య‌స‌భ రెన్యువ‌ల్ వ‌ద్ద‌ని ప్ర‌క‌టించ‌డం.. ఆ వెంట‌నే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తాన‌ని చెప్ప‌డం ఇప్పుడు స‌త్య‌నారాయ‌ణ‌కు గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తున్నాయి.

ఎందుకంటే.. విశాఖ అయితే.. త‌న‌కు అనుకూలంగా ఉంటుంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌ను విజ‌యం ద‌క్కించుకుంటాన‌ని స‌త్యానారాయ‌ణ భావిస్తున్నారు.కానీ, సాయిరెడ్డి మంత్రాంగం బాగా చేస్తుండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంవీవీని ఇక్క‌డ నుంచి త‌ప్పించి.. అన‌కాప‌ల్లికి పంపిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అనకాప‌ల్లి నుంచి గ‌ట్టి అభ్య‌ర్థి బ‌రిలోకి దిగితే.. త‌న గెలుపు అంత ఈజీకాద‌ని.. ఎంవీవీ అంచ‌నా వేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో విశాఖ‌నే త‌న‌కు కేటాయించాల‌ని.. ఆయ‌న అప్పుడే.. ఒక సందేశం కూడా చూచాయ‌గా మీడియా ద్వారా పంపిస్తున్నారు. ``వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్పుడే వార్త‌లు రాయ‌డం అవ‌స‌రమా?`` అని స్థానిక మీడియాను ఆయ‌న ప్ర‌శ్నించారు. కానీ, లోలోన మాత్రం జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆయ‌న‌ను వేద‌క‌ను గురిచేస్తున్నాయి.
Tags:    

Similar News