వైసీపీ కొందరు నేతలు.. తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారిపోయారు. మరికొందరు పార్టీలోనే అంతర్గత శత్రువులను పెంచుకుంటు న్నారు. ఇంకొందరు ప్రజలకు చేరువ కాలేక పోతున్నారు. ఇలా... చాలా మంది నాయకులు.. పార్టీలో వివాదంగానే మారుతున్నారు. అయితే.. వీరిలో ఎక్కువ మంది కొత్త నాయకులు కావడం గమనార్హం. ఎమ్మెల్యేలను తీసుకుంటే.. విడదల రజనీ, ఉండవల్లి శ్రీదేవి, జక్కంపూడి రాజా, బియ్యపు మధుసూదన్‌రెడ్డి.. వంటివారు ప్రముఖంగా కనిపిస్తున్నారు. మరోవైపు ఎంపీల్లోనూ ఒకరిద్దరు వివాదాలకు కేంద్రంగానే ఉన్నారు. వీరిలో.. ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు.. మార్గాని భరత్, నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయులు, గోరంట్ల మాధవ్ వంటివారివి ఉన్నాయి.
వీరంతా తొలిసారి విజయం దక్కించుకున్నవారే కావడం గమనార్హం. తొలిసారి కావడంతోనే వివాదాలకు దారితీస్తున్నారా? లేక కావాలనే ఇలా చేస్తున్నారా? అనేది ప్రశ్నగా మారింది. కొందరికి అసెంబ్లీలోనూ.. పార్లమెంటులోనూ కూడా మాట్లాడడం రాకపోవడంతో పార్టీ ఇరుకున పడుతోంది. ఇటీవల మార్గాని భరత్ లోక్‌సభలో మాట్లాడుతూ.. కేంద్రాన్ని సాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో ఆయన సింపతీ కోసం చేసిన ప్రయత్నం ఎదురు తిరిగి.. పార్టీ ఇబ్బంది పడింది.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని.. ఆయన పార్లమెంటులో చెప్పేసరికి .. దానిని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అడ్వాంటేజ్ గా తీసుకుంది. ఇక, అదే లోక్‌సభలో.. నందిగం సురేష్.. మరో ఎంపీని దుర్భాషలాడారనే విషయం వెలుగు చూసిన తర్వాత.. ఆయన ఖండించినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక, ఎమ్మెల్యేలు కూడా ప్రత్యర్థులపై పోరాటం చేయాల్సింది పోయి.. సొంత పార్టీ నేతలపైనే వివాదాస్పదంగా మారుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత! అనుకునే స్థాయిలో వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. దీంతో పార్టీకి ఇబ్బందిగా మారింది.
ఈ క్రమంలో వీరికి సీనియార్టీ లేక పోవడంతోనే ఇలా జరుగుతోందని.. కొందరు అభిప్రాయపడుతుంటే.. మరికొందరు అన్నీ కావాలనే చేస్తున్నారని అంటున్నారు. దీనిపై ఇటీవల ఒక ఎంపీకి సజ్జల రామకృష్ణా రెడ్డి ఫోన్ చేసి మరీ క్లాస్ పీకే పరిస్థితి వచ్చింది. ఇక, ఎమ్మెల్యేలకు కూడా వరుస పెట్టి ఆయన వార్నింగులు ఇచ్చారని.. పరిస్థితి ఇలానే కొనసాగితే.. కస్టమని.. సబ్జెక్టును పెంచుకోవాలంటూ.. సలహా ఇచ్చారని తెలుస్తోంది. ఏదేమైనా.. ఆ నేతలు ఎందుకు వివాదం అవుతున్నారు? కొత్త కాబట్టా..? కావాలనా? అనే చర్చ మాత్రం జోరుగా సాగుతుండడం గమనార్హం.