అమ‌రావతి రైతులు పాద‌యాత్ర చేస్తే.. మంత్రుల‌కు ఇబ్బంది ఏంటి... చూద్దాం!!

Update: 2022-10-12 10:53 GMT
పాద‌యాత్ర‌!.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు.. వారిని ఆలోచింప చేసేందుకు.. ఎంచుకునే కీల‌క‌మైన సాధ నం. ఇప్పుడు ఈ దేశంలో కొత్త‌గా పుట్టుకువ‌చ్చిన విధానం కాదు. దేశానికి స్వాతంత్య్రం తీసుకువ చ్చేందు కు.. గాంధీ స‌హా వంద‌ల మంది స‌మ‌ర‌యోధులు ఎంచుకున్న ప్ర‌ధాన‌మైన అహింసాయుత మాత్రం.. పాద యాత్ర‌. 'దండి మార్చ్‌' ఇలా పుట్టిందే. త‌ర్వాత కాలంలో.. అనేక ప్ర‌భుత్వాల‌పై.. ఉద్య‌మించాల్సిన స‌మ యం వ‌చ్చిన‌ప్పుడు.. ఉద్య‌మకారులు కూడా పాద‌యాత్ర‌ను ఎంచుకున్నారు.

త‌ర్వాత‌..త‌ర్వాత‌.. ఇది రాజ‌కీయంగా కూడా ఉప‌యోగ‌ప‌డింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో అవ‌సాన ద‌శ‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప‌ట్టాలెక్కించి.. అధికారంలోకి తెచ్చేందుకు దివంగ‌త‌ వైఎస్‌.. రాజ‌శేఖ‌రెడ్డి పాద‌యాత్ర‌ను ఆయుధంగా ఎంచుకున్నారు. 3 వేల కిలో మీట‌ర్లు పాద‌యాత్ర చేసి.. ప్ర‌జ‌ల‌కు చేరువై.. అధికారం సంపా యించుకున్నారు. త‌ర్వాత‌.. ఈ ప‌రంప‌ర‌లోనే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం.. వ‌స్తున్నామీకోసం.. అంటూ.. పాద‌యాత్ర చేసి.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు.

ఇక‌, ప్ర‌స్తుతం ఏపీ సీఎంగా ఉన్న జ‌గ‌న్ కూడా.. తండ్రిని మించిన‌ట్టుగా.. 3670 కిలో మీట‌ర్లు న‌డిచి.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుని.. అధికారం ఇవ్వాల‌ని.. అభ్య‌ర్థించారు. ఇక‌, ఇప్పుడు.. ఆయ‌న సోద‌రి.. ష‌ర్మిల కూడా.. తెలంగాణ‌లో పాద‌యాత్ర చేస్తూ.. పార్టీ కోసం.. శ్ర‌మిస్తున్నారు. అంటే.. త‌మ అభిప్రాయాల‌ను.. లేదా.. ఉద్దేశాల‌ను.. ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి.. వారిని చైత‌న్య పరిచేందుకు పాద‌యాత్ర ఒక శాంతి యువ‌.. ప్ర‌జాస్వామ్య పంథా అనే చెప్పాలి.

ఇక‌, ఇప్పుడు అస‌లు విష‌యానికి వ‌ద్దాం. ప్ర‌స్తుతం వైసీపీ తీసుకువెచ్చిన మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద నకు వ్య‌తిర‌కంగా.. రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు ఉద్య‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలో శాంతియుతంగా.. పాద యాత్ర‌ను ఎంచుకుని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు.

తాము భూములు ఇచ్చామ‌ని.. రాష్ట్ర ప్ర‌జ‌ల కు అత్యుత్త‌మ  రాజ‌ధాని కోసం.. అనేక త్యాగాలు చేశామ‌ని.. వారు ఈ పాద‌యాత్ర ద్వారా.. ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అది కూడా.. న్యాయ‌స్థానం అనుమ‌తి.. తీసుకున్నాకే.

అయినా.. కూడా వైసీపీ మంత్రులు.. నేత‌ల‌కు మాత్రం.. ఇబ్బందిగానే ఉంది. ఎక్క‌డిక‌క్క‌డ ఈ పాద‌యా త్రపై అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతూనే ఉన్నారు. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు , క‌వ్వింపు చ‌ర్చ‌లు కామ‌న్ అయిపోయాయి. ఏం.. స్వ‌తంత్ర దేశంలో త‌మ అభిప్రాయాల‌ను ప్ర‌జ‌ల‌కు చెప్పుకొనేందుకు పాద‌యాత్ర చ‌య‌డం త‌ప్పా? ఇదే త‌ప్ప‌యితే.. వైఎస్ చేసింది.. జ‌గ‌న్ చేసింది.. త‌ప్పేక‌దా! లేక‌పోతే.. పాద‌యాత్ర‌ను చూసి.. భ‌యం ప‌ట్టుకుందా?  ప్ర‌జ‌లు ఏక‌మైతే.. త‌మ మూడు ప్ర‌తిపాదన మంట‌గ‌లుస్తుంద‌ని.. బావిస్తున్నారా? అనేది ఆస‌క్తిగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News