ప‌వ‌న్ క‌ల్యాణ్ : పొలిటిక‌ల్ మైలేజీ కోస‌మే మాట్లాడుతున్నాడా ? దేవుడా !

Update: 2022-04-21 08:04 GMT
కౌలు రైతుల‌కు సాయం చేయండి అని విన్న‌వించిన జ‌న‌సేనాని మ‌ళ్లీ టార్గెట్ చేశారు నెల్లూరు నాయ‌కులు. ఆ విధంగా ఆయ‌న పై మ‌రో మారు విరుచుకుపడ్డారు. దీనిని వెర్బ‌ల్ ఎటాక్ అని అనాలి. ఎందుక‌ని అదే ప‌నిగా వైసీపీ మంత్రులు త‌మ కోపాన్ని మ‌రియు జ‌గ‌న్ ఉద్దేశాన్ని క‌లిపి జ‌నంపై రుద్దుతున్నారు అని ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన ప్ర‌శ్నిస్తోంది.

తమ అధినేత త‌న‌కు తోచిన రీతిన బాధిత కుటుంబాల‌కు ఐదు కోట్ల రూపాయ‌ల మేర‌కు సాయం అందించార‌ని, ఇందులో త‌ప్పేం ఉంద‌ని, మంచి కోరి, రాష్ట్రం బాగు కోరి, రైతు మేలు కోరి నాలుగు మాట‌లు చెప్పినా త‌ప్పేనా ? ఆ పాటి మాట‌ల‌ను అర్థం చేసుకునే ప‌రిప‌క్వ‌త లేదా అని జ‌న‌సేన నాయ‌కులు వైసీపీకి కౌంట‌ర్ ఇస్తున్నారు.

ఈ నేప‌థ్యాన నెల్లూరు కేంద్రంగా పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి. ప‌వ‌న్ ను టార్గెట్ గా చేసుకుని మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇవే ఇప్పుడు జ‌న‌సేన కోపానికి కార‌ణం అవుతున్నాయి.

వాస్త‌వానికి ప‌వ‌న్ కు వ్య‌వ‌సాయం అంటే ఏంటో తెలియ‌దు అని, విత్త‌నాలు నాటితే వ‌రి వృక్షాలు వ‌స్తాయ‌ని అనుకుంటున్న‌వారంతా కేవ‌లం పొలిటిక‌ల్ మైలేజీ కోస‌మే కౌలు రైతుల కోస‌మో లేదా ఇత‌ర సాగుదారుల కోసమో మాట్లాడుతుంటార‌ని ఘాటుగానే విమ‌ర్శించారు.

త‌న జిల్లాకే చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ను గుర్తుకు తెచ్చేవిధంగా మాట్లాడారు. ఇదే సంద‌ర్భంలో ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌రకు చేరిన నెల్లూరు నాయ‌కుల విభేదాల గురించి మాత్రం పాపం ఏమీ మాట్లాడ‌లేదు ఆయ‌న.

ఎందుకంటే అస్స‌లు త‌న‌కూ, ఆయ‌న‌కూ విభేదాలే లేవ‌ని తేల్చేశారు. ఏ విభేదం లేకుండా ఉంటే అంత స‌ఖ్య‌త‌తోనే ఆ ఇద్ద‌రూ ఉండ‌గ‌లిగి ఉంటే ఎందుక‌ని ఫ్లెక్సీ వివాదాలు రాజుకుంటున్నాయి అని విలేక‌రులు ప్ర‌శ్నిస్తే  స‌మాధానం మాత్రం కాస్త ఆచితూచి సీఎం ఆదేశాల‌ను అనుస‌రించి ప‌నిచేయ‌డం త‌ప్ప త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని చెప్పేశారు మ‌రియు తేల్చేశారు.
Tags:    

Similar News