నవ్యాంధ్ర నూతన రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన అమరావతిపై ఇప్పుడు పెద్ద అయోమయమే నెలకొందని చెప్పాలి. రాజధాని ప్రకటనను ముందుగా తన వాళ్లకు లీక్ చేసిన మాజీ సీఎం చంద్రబాబు.. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తున్న జగన్ సర్కారు... సదరు వ్యవహారంపై ఏకంగా పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అదే సమయంలో అమరావతిని కేవలం లెజిస్లేచర్ కేపిటల్ కు మాత్రమే పరిమితం చేసి... ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను విశాఖకు - జ్యూడిషియల్ కేపిటల్ ను కర్నూలుకు తరలించే దిశగా జగన్ సర్కారు కదులుతోంది. ఈ క్రమంలో అమరావతి నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల పరిస్థితి నిజంగానే అయోమయంలో కూరుకుపోయింది. రాజధానికి తమ భూములు ఇస్తే... ఇప్పుడు అసలు రాజధానే తరలిపోతోంటే తమ పరిస్థితి ఏం కావాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఇలాంటి కీలక తరుణంలో కొన్నాళ్ల పాటు కనిపించని రాజధాని ప్రాంత ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజధాని రైతులకు వారి భూములను తిరిగి ఇచ్చేస్తామంటూ ఆళ్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగానే కలకలం రేపుతున్నాయి. ఓ వైపు రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని రైతులు 11 రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. మొన్నటి కేబినెట్ భేటీ సందర్భంగా రాజధాని ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇలాంటి కీలక తరుణంలో రాజధాని రైతులకు వారి భూములను వారికి తిరిగి ఇచ్చేస్తామంటూ ఆళ్ల వ్యాఖ్యానించడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజధాని రైతులకు భూముల వాపస్ ఆఫర్ ఇచ్చిన ఆళ్ల... అందుకు ఓ షరతు కూడా పెట్టారు. తమ భూముల్లో తిరిగి వ్యవసాయం చేసుకుంటామని, తమ భూములను తిరిగి ఇచ్చేయమని కోరే రైతులకు మాత్రమే భూములను వాపస్ చేస్తామని ఆళ్ల చెప్పుకొచ్చారు.
ఈ విషయంలో ఆళ్ల ఇంకా ఏమన్నారంటే... రాజధాని రైతుల్లో కేవలం పది శాతం మంది మాత్రమే ఆందోళనలు చేస్తున్నారని.. మిగిలిన వారంతా టీడీపీ తరలించిన వారేనని ఆళ్ల వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇతర జిల్లాల నుంచి జనాన్ని రప్పించి నిరసనలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని రైతులకు న్యాయం చేస్తుందని ఆళ్ల తెలిపారు. గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ లో భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని చెప్పిందని.. కానీ నేటికీ ఇవ్వలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే చెప్పారు. రాజధాని భూములు తిరిగిచ్చేస్తామని కొద్దిరోజుల కిందట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యినించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి భూములు తిరిగి ఇచ్చేస్తామంటూ ఆళ్ల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.