విశాఖ జిల్లా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజకీయ నేతనే కాదు స్వతహాగా కళాకారుడు. అయనకి చిన్నప్పటి నుండి నటన పై ఆసక్తి ఎక్కువగా ఉండేది. రాజకీయాల్లోకి రాకముందు తన స్వగ్రామం కేజే పురంలో పలు నాటకాల్లో నటించి జనాల మన్ననలను పొందారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు హైదరాబాదులో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అన్నమయ్య పాత్రను పోషించి... అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేగా ప్రజా కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ తనలోని కళాపోషణను ఆయన అప్పుడప్పుడు బయటపెడుతుంటారు.
తాజాగా మన్యం ఇలవేల్పు, గిరిజనుల ఆరాధ్య దైవం జై. మోదకొండమ్మ సినిమాలో ఎమ్మెల్యే ధర్మశ్రీ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గాజువాకలో జరుగుతోంది. మంగళవారం శ్రావణమాసం శుభ సందర్భంగా గాజువాకలో షూటింగ్ ప్రారంభించారు. పరమశివుని తపోభంగం చేయటానికి వచ్చిన మాంత్రికుని మధ్య జరిగిన సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమాలో ఎమ్మెల్యే ధర్మశ్రీ శివుని పాత్రలో నటిస్తున్నారు.