ఈ సెగ తగ్గేది లేదు.. మరో దారి చూడండి సర్.. జగన్‌కు ఎమ్మెల్యే మొర!!
ఔను.. ఎప్పుడూ.. సీఎం జగన్ చెప్పడమే కాదు, ఎమ్మెల్యేలు కూడా ఇటీవల కాలంలో తమ సమస్యలు చెప్పడం ప్రారంబించారు. ఇప్పటి వరకు సీఎం జగన్ ఏదో చేస్తారని అనుకున్ననాయకులు ఆయన ముందు మాట్లాడేందుకు అంతో ఇంతో సంకోచించేవారు. అయితే, ఎన్నికలకు సమయం దగ్గర పడుతుం డడం, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమాత్రం మార్పుకనిపించకపోవడంతో వారు కూడా ధైర్యం చేస్తున్నారు.
తాజాగా సీఎం జగన్ రెండు కీలక నియోజకవర్గాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సమయంలో సీఎం జగన్ మాట్లాడుతుండగానే.. ఒక నేత మైకు అందుకుని.. తన నియోజకవర్గంలో పార్టీపై ఉన్న వ్యతిరేకతను పూస గుచ్చి చెప్పినట్టు తెలిసింది. ``నిజమే సర్.. నా నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. నేను ప్రజలతో కలుస్తున్నాను.
అయితే, ప్రజలు అనేక సమస్యలు చెబుతున్నారు. చాలా మంది పించన్లు కట్ చేశారని అంటున్నారు. వీటిని విచారిస్తే.. మాకు సంబంధం లేదని వలంటీర్లు చెబుతున్నారు. పైవాళ్లను అడిగితే.. మౌనంగా ఉంటున్నారు. ఏం చేయాలి?`` అని ప్రశ్నించారని తెలిసింది.
మరోనేత, కనీసం ప్రజలు కోరుతున్న చిన్న చిన్న పనులు కూడా చేయించలేక పోతున్నాం. రెండు ట్రాక్టర్ల గ్రావెల్ తోలించి రోడ్డును చదును చేయించాలన్నా.. మంత్రి గారి అనుమతి తీసుకోవాలని ఉన్నతాధికా రులు చెబుతున్నారు. పోనీ.. మేం చేయించాలన్నా.. మాకు నిధులు లేవు. ఇవ్వరు. మేం వెళ్లడం లేదు కాబట్టే వ్యతిరేకత పెరుగుతోందన్న నివేదికలు సరికాదు. ఈ విషయంపై మీరే స్వయంగా దృష్టి పెట్టాలి! అని కుండబద్దలు కొట్టినట్టు సమాచారం.
వాస్తవానికి ఈ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మంత్రులకు -ఎమ్మెల్యేలకు మధ్య భేదాలు రావడం.. ఆధిపత్య రాజకీయాలకు తెరదీయడం వల్లే ఇలా జరుగుతున్నాయనేదివాస్తవం. దీనికితోడు.. ప్రజలకు సంక్షేమం ఇస్తున్నాం కదా.. ఇంతకన్నా ఏం కోరుకుంటారనే వాదన కూడా సరికాదనే సూచనలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలు.. వ్యూహాత్మకంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. దీనిని సరిదిద్దాలంటే తక్షణం తమకైనా అధికారాలు ఇవ్వాలనేది .. వైసీపీ నేతల మాట. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.