కనుమూరి రఘురామకృష్ణరాజు.. ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్. వైసీపీ నాయకుడు.. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపు రం పార్లమెంటు సభ్యుడు. అయితే.. ఆయన ఆ పార్టీ తో విభేదించడం తెలిసిందే. కారణాలు ఏవైనా కూడా ఇటు పార్టీ కూడా ఆయనను పక్కన పెట్టింది. దీంతో ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించడం.. ఏకంగా సీఎం జగన్ బెయిల్‌నురద్దు చేయాలని కోరుతూ.. న్యాయపోరాటానికి దిగిన విషయం తెలిసిందే. ఇక, ఇదేసమయంలో.. ఆర్ ఆర్ ఆర్ ను కూడా వైసీపీ టార్గెట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా.. ఆయన పరువు తీసేలా వ్యాఖ్యలు చేశారు.
రెబల్ గా మారిన రఘురామకృష్ణ పై తొలుత.. నర్సాపురం వైసీపీ నేత ప్రసాదరాజు బహిరంగ వ్యాఖ్యలే చేశారు. తర్వాత.. కూడా చాలా మంది నాయకులు ఆర్ ఆర్ ఆర్ ను టార్గెట్ చేశారు. అయితే.. మీడియా ముందుకన్నా కూడా సోషల్ మీడియా ప్లాట్ ఫాం పైనే.. ఆర్ ఆర్ ఆర్ ను ఎక్కువ గా ఏకేశారు. విక్కురాజా-బ్యాంకుల దొంగ-ఊరసవెల్లి.. వంటి పదాలు కొన్ని రోజులు హల్చల్ చేశాయి. ముఖ్యం గా వైసీపీ కి ఉన్న ప్రత్యేక సోషల్ మీడియా వేదిక గా.. రఘురామను లక్ష్యం గా చేసుకుని వ్యాఖ్యలు సంధించారు వైసీపీ నాయకులు.
అంతే కాదు, దమ్ముంటే రాజీనామా చేయాలని.. సొంతం గా గెలిచి చూపించాలని కూడా ఈ వేదిక గానే సవాళ్లు రువ్వారు. ఇక, ఆయా విమర్శలకు ఆర్ ఆర్ ఆర్ కూడా తన దైన శైలి లో కౌంటర్లు ఇచ్చారు. తన ను కెలికితే... తాను సీఎం ను కెలుకుతానంటూ.. వ్యాఖ్యానించారు. ఇలా.. ఇరు పక్షాల మధ్య వివాదాలు.. సోషల్ మీడియా లో తార స్థాయికి చేరుకున్నాయి. ఇక, ఇటీవల కాలం లో మాత్రం ఆర్ ఆర్ ఆర్ పై వైసీపీ సోషల్ మీడియాలో దూకుడు తగ్గింది. ఆయనను ఎవరూ పెద్దగా టార్గెట్ చేయడం లేదు. అయితే.. మరోవైపు.. ఆర్ ఆర్ ఆర్ మాత్రం తన పంథాను ఎక్కడా విడిచి పెట్టలేదు.
జగన్ ను, ఆయన ప్రభుత్వాన్ని, మంత్రుల ను, ఆర్థిక పరిస్థితి ని, అప్పులను.. ఆర్ ఆర్ ఆర్ ఎప్పటి కప్పుడు టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. కానీ, నిన్న మొన్నటి వరకు ఆర్ ఆర్ ఆర్‌ను టార్గెట్ చేసిన.. వైసీపీ మాత్రం ఇప్పుడు టార్గెట్ చేయడం తగ్గించింది. దీనికి రీజనేంటి? అంటే.. అసలు వైసీపీ సోషల్ మీడియా ను పార్టీ అధిష్టానమే పట్టించుకోవడం లేదని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. దీంతో తాము ఎలాంటి కామెంట్లు పెట్టినా.. తమకు ఒనగూరే ప్రయోజనం ఏంటని వారు భావిస్తున్నారు. ఈ క్రమం లోనే ఆర్ ఆర్ ఆర్‌ను కెలికి.. తామెందుకు తిట్టించుకోవాలని అనుకుంటున్నారట.
ఇక్కడ మరో కీలక విషయం కూడా ఉంది. పార్టీ కి యూత్ ముఖ్యమని అంటూనే.. వారిని అవసరం వచ్చినప్పడు వినియోగించుకుంటున్న వైసీపీ నేతలు.. తమ అవసరం తీరాక అస్సలు పట్టించుకోవడం మానేస్తున్నారు. దీంతో యువత ఇప్పుడు తీవ్ర నిరాశ తో ఉన్నారు. వైసీపీ పేరు కూడా ఎత్తేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యం లోనే.. ఇప్పుడు యూత్ కూడా వైసీపీ కి దూరమయ్యే ఆలోచన లో ఉన్నారని.. ఇది కూడా ఆర్ ఆర్ ఆర్ పై కామెంట్లు.. తగ్గిపోవడానికి కారణమని అంటున్నారు పరిశీలకులు.