పట్టాభిని పోలీసులు కొట్టారు... నాకు ఫోన్ చేస్తే అన్ని విషయాలు చెబుతా

Update: 2021-10-29 09:30 GMT
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సమయం, సందర్భం లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ ఆ పార్టీకి కంట్లో నలుసుగా మారారు. ఏపీ ప్రభుత్వంపై వరుసపెట్టి ప్రతి రోజు ఏదో రూపంలో అక్కసు వెళ్లగక్కతుంటారు. మా ప్రభుత్వం, మా పార్టీ అంటూ సటైర్లు వేస్తుంటారు. వైసీపీ ప్రభుత్వంపై అసమ్మతిని ఎగదోసే పనిలో బిజీగా ఉన్నారు. పార్టీ అధిష్టానంపై కత్తి కట్టి మరీ విమర్శలు సంధిస్తుంటారు. ప్రతి రోజులాగా గురువారం మిట్ట మధ్యాహ్నం.. అది కూడా ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టారని ఆరోపించారు. అది కూడా పట్టాభిని కొట్టారా లేదా? అనే విషయంపై తన సహచర ఎంపీ విజయసాయిరెడ్డిని సాక్ష్యం చెప్పాలంటూ ప్రశ్నించారు.

తనను పోలీసులు కొట్టలేదని పట్టాభిని మేజిస్ట్రేట్‌కు వాగ్మూలం ఇచ్చారు. అయితే పట్టాభిని కొట్టారని తనకు పోలీసులు ఫోన్ చేస్తే అన్ని విజయాలు చెబుతానని రఘురామ అంటున్నారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తేలాల్సి ఉంది. ఇలా ఆయన నిత్యం సీఎం జగన్‌ను విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసుకుని మాట్లాడుతూ వైసీపీకి పక్కలో బల్లెంలా తయారవుతున్నారు.

పట్టాభిని మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించే క్రమంలో పోలీసులు కొట్టారని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. పట్టాభిని కొట్టినట్లు తనకు పక్కగా సమాచారం ఉందని తెలిపారు. విజయవాడ సీపీ కానీ, కృష్ణా ఎస్పీ కానీ ఈ ఘటనపై ఫోన్‌ చేస్తే చెపుతానని ప్రకటించారు. పట్టాభిని పోలీసులు కొట్టారా? లేదా విజయసాయి సమాధానం చెప్పాలంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి పోలీసులకు తేడా లేదని ఆరోపించారు. పోలీసులపై తనకు గౌరవం ఉందంటూనే కొందరు పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తెస్తున్నారని విమర్శించారు. ఇటీవల ఎవరు ఏం చెప్పినా పోలీసులకు నోటీసులు ఇవ్వడం అలవాటుగా మారిందని తప్పుబట్టారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మంచి వారేనని తెలిపారు.

అయితే ఆయనకు పరిస్థితితులు అనుకూలంగా లేవని చెప్పారు. పనిలో పనిగా పోలీసున్నాధికారులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఏపీలో అఖిల భారత సర్వీసు అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌ చేయడంతో తమ పార్టీ నేతలు కలత చెందుతున్నారని ఎద్దేవాచేశారు. టీడీపీ, బీజేపీ దగ్గర అవుతాయని తమ పార్టీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అసభ్యకరమైన మాటలకు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించారని కోరారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌ చాలా మాట్లాడారని రఘురామ గుర్తుచేశారు.

జ‌గ‌న్‌కు వైసీపీకి న‌చ్చ‌ని పేరు ఏదైనా ఉందంటే అది ర‌ఘురామ‌కృష్ణరాజు అనే ఎవరైనా చెబుతారు. అంత‌లా ప్రభుత్వాన్ని ఆయన ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిరోజు పని కట్టుకుని మరీ ప్రభుత్వం బురదజల్లుతుంటారు. ఆయనను అదుపులో పెట్టేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలు సఫలం కాలేకపోయారు. తనకున్న రాజకీయ పలుకుబడితో ఆయన ఏపీ ప్రభుత్వపై అనేక ఆరోపణలు చేస్తున్నా.. వైసీపీ నేతలు ఏమీ చేయలేక మిన్నకుండి పోయారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టారు.

జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎందుకు పిటిషన్‌లు వేస్తున్నారని అడిగే.. జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న నమ్మకంతో పిటిషన్ వేస్తున్నానని వింతగా సమాధానం చెబుతున్నారు. గతంలో జగన్ బెయిలు రద్దు చేయాలని నాంపల్లి సీబీఐ కోర్టులో రఘురామ పిటిషన్ వేయగా కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును ఆయన తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. సాంకేతిక కారణాలతో హైకోర్టు వెనక్కి పంపింది. ఈ నేపథ్యంలోనే రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలా జగన్,  వైసీపీ ప్రభుత్వంపై ప్రతిరోజు ఏదో రూపంలో విమర్శలు చేయడం రఘురామకు అలవాటుగా మారిపోయిందని పలువురు విమర్శలు చేస్తున్నారు.
Tags:    

Similar News