వైసీపీలోని ఓ మంత్రి అక్రమాల వ్యవహారంపై అధిష్టానం దృష్టి సారించినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా నియామకమైన సదురు నేత గద్దెనెక్కినప్పటి నుంచి పార్టీ ఎజెండాను పక్కనపెట్టి సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్నాడట.. వైసీపీ పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనపెట్టి సీట్లు, కాంట్రాక్టుల్లో తన వారికే పట్టం కట్టడంపై నేతలంతా ఇటీవల సమావేశం పెట్టి మరీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడా ఆ మంత్రి నియోజకవర్గంలో అసమ్మతి అట్టుడుకుతోంది.
మూడు రోజుల క్రితం ఆ నియోజకవర్గంలో మంత్రి వ్యవహారశైలిపై విసుగెత్తిపోయిన పార్టీ సీనియర్లు సమావేశమై మంత్రి తీరుకు ఎలా చెక్ పెట్టాలో చర్చించుకున్నారు. వైసీపీ అధిష్టానానికి లేఖలు రాయాలని నిర్ణయించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన ఒంటెత్తు పోకడలు, పార్టీ నియోజకవర్గంలో ఎంత నష్టపోయిందో అందులో వివరించనున్నారు.
మంత్రి అయ్యాక ఆయన పార్టీ శ్రేణులను పూర్తిగా విస్మరించారని వారంతా లేఖలో వివరించారు. పార్టీ కోసం ఐదేల్లు పనిచేసిన వారిని కాదని.. వైసీపీ గెలుపు కోసం శ్రమించిన వారిని పక్కనపెట్టి.. మంత్రి తన బినామీలు, అనుచరులకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ వారంతా విమర్శలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే టికెట్ ను సదురు మంత్రికి పోయిన ఎన్నికల్లో త్యాగం చేసిన వ్యక్తికి కార్పొరేటర్ టికెట్ కూడా దక్కకుండా చేయాలని మంత్రి ప్రయత్నిస్తున్నారని సదురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో నాలుగు మినహా మిగిలిన 18 డివిజన్ల నుంచి డబ్బులు ఇచ్చిన వారినే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారని నేతలు ఆరోపిస్తున్నారు. సంబంధం లేని వ్యక్తులకు టికెట్లు ఇవ్వడంతో ఓ వైసీపీ సిట్టింగ్ కార్పొరేటర్ టికెట్ దక్కక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి వాటివల్ల నియోజకవర్గంలో పార్టీ దెబ్బతింటోందని వారంతా అధిష్టానం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారట..
మంత్రి గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కొక్క సీటును ఏకంగా రూ.15 నుంచి 30 లక్షల వరకు అమ్ముకున్నారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. నలుగురు ఐదుగురు బినామీలను ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో అక్రమాలు చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. వీరంతా అధిష్టానానికి లేఖలు రాయాలని.. వినకపోతే డైరెక్టుగా కలవాలని యోచిస్తున్నారట..
మంత్రిపై వస్తున్న అవినీతి ఆరోపణలు దీర్ఘంగా గమనిస్తున్న వైసీపీ అధిష్టానం అతడిపై నజర్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.