రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల్లో వైసీపీ దూకుడు అందరికీ తెలిసిందే. భారీ ఎత్తున ఎంపీటీసీ స్థానాలు గెలుచు కుంది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుంది. అయితే.. కొందరు కీలక నేతల నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ పట్టు పెంచుకుంది. ఇలాంటి చోట.. వైసీపీ గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వైసీపీ నాయకులు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. టీడీపీని నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు... అదును చూసి టీడీపీని దెబ్బకొట్టారనే గుసగుస వినిపిస్తోంది.
మంగళగిరిలోని దుగ్గిరాల మండలంలో టీడీపీ ఆధిక్యత సాధించింది. దీంతో వైసీపీ ఇక్కడ ఎంపీపీ స్థానా న్ని పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృ ష్ణారెడ్డికి ప్రతిష్టతో కూడుకున్న విషయం కావడంతో ఆయన ఇక్కడ చక్రం తిప్పుతున్నారని అంటున్నా రు. ఇప్పటికే టీడీపీ ఎంపీపీ అభ్యర్థికి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా.. తహసీల్దార్ అడ్డంకులు సృష్టిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక, ఇప్పుడు టీడీపీని నైతికంగా దెబ్బకొట్టేలా.. టీడీపీకి చెందిన మాజీ మంత్రి.. మురుగుడు హనుమంత రావును పార్టీని తప్పించారని అంటున్నారు.
పైకి హనుమంతరావు మాత్రం స్వయంగా రాజీనామా సమర్పించానని చెబుతున్నా.. తెరవెనుక మాత్రం ఆళ్ల చక్రం తిప్పారనే గుసగుసలు టీడీపీలో వినిపిస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకుడిగా చురుగ్గా ఉన్న హనుమంతరావు.. తాజాగా టీడీపీకి రాజీనామా చేశారు. ఆప్కో చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు. సీనియర్ నాయకుడు కావడం గమనార్హం. 1999, 2004లో కాంగ్రెస్ టికెట్‌పై మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే.. తాజాగా ఆయన రాజీనామా చేస్తూ.. కొన్ని సంచలన కామెంట్లు చేయడం విశేషం.
టీడీపీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని.. పార్టీ తన సేవలు ఉపయోగించుకోవడం లేదన్నారు. గత ఏడాది నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్నానని.. తాను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండే ఆప్కోకి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మంది బోర్డు సభ్యులు ఉన్నారన్నారు. ప్రభుత్వ సహకారం లేనిదే ఆప్కో అభివృద్ధి చెందదన్నారు. అదే కారణంతో తాను టీడీపీలోకి వచ్చానని.. చంద్రబాబు హయాంలో ఆప్కోకి ఎటువంటి ప్రయోజనం కలగలేదని.. ప్రస్తుతం మన మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరుగుతోందని చెప్పుకొచ్చారు.
సో.. దీనిని బట్టి.. మురుగుడు వెనుక ఎవరున్నారనేది స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు విశ్లేషకులు. ఇక, తాను ఏ పార్టీలోకి వెళ్ళేది కార్యకర్తలు, అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని హనుమంతరావు చెప్పడం గమనార్హం. మొత్తానికి ఈ ప్రభావం ఎంపీపీ ఎన్నికలపై పడుతుందని.. ఇదే వైసీపీ కూడా కోరుకుంటోందని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.