రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టారా ?

Update: 2022-10-11 00:30 GMT
వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి రాయలసీమలోని సీట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారా ? పార్టీవర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం రాయలసీమ ప్రాంతానికి చెందిన కొంతమంది ప్రముఖనేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లనూ గెలవాలని జగన్ పట్టుదలగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అది సాద్యమవుతుందా ? లేదా అన్న విషయాన్ని వదిలేస్తే ప్రయత్నాలైతే గట్టిగానే చేస్తున్నారు.

2014 ఎన్నికల్లో రాయలసీమలోని 52 సీట్లలో వైసీపీ 32 సీట్లను గెలుచుకున్నది. ఇక 2019 ఎన్నికల్లో 49 నియోజకవర్గాల్లో గెలిచింది. మూడుసీట్లయిన కుప్పంలో చంద్రబాబునాయుడు, హిందుపురంలో నందమూరి బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గెలిచారు. ఈ మూడుసీట్లలో టీడీపీ గెలవటం జగన్ కు పంటికింద రాయిలా తగులుతోంది. కుప్పం చిత్తూరు జిల్లాలో ఉండగా మిగిలిన రెండు సీట్లు అనంతపురం జిల్లాలో ఉంది.

సో వచ్చే ఎన్నికల్లో 52కి 52 క్లీన్ స్వీప్ చేయాలన్నది జగన్ టార్గెట్. కుప్పంలో చంద్రబాబును ఓడించటం అంత సులభంకాదు. అలాగే హిందుపురంలో టీడీపీ ఓటమంటే మామూలు విషయంకాదు.

ఎందుకంటే 1983 నుండి ఇప్పటివరకు టీడీపీ ఓడిపోని సీటేదన్నా ఉందంటే అది హిందుపురమే. పైగా ఈ నియోజకవర్గంలో వైసీపీలో అనేక గొడవలున్నాయి. కాబట్టి వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని చెప్పేందుకు లేదు. జగన్ తెప్పించుకుంటున్న నివేదికల్లో రాయలసీమలో 20 నియోజకవర్గాల్లో వైసీపీకి ఇబ్బందులున్నట్లు తేలిందట.

ఇపుడు కీలకనేతలతో సమావేశం ఎందుకంటే ఆ 20 నియోజకవర్గాల్లో సమస్యలను అధిగమనించి గెలుపు సాధించేందుకు అవసరమైన వ్యూహాలను రచించేందుకే. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలేవి ? బలహీనంగా ఉన్న నియోజకవర్గాలేవి ? టీడీపీలో బలమైన నేతలెవరు ? అనే అంశాలపైన కూడా జగన్ చర్చించినట్లు సమాచారం. మరి జగన్ టార్గెట్ ఎంతవరకు రీచవుతారో చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News