వైసీపీ ఏపీ రాజకీయాల్లో కొత్త ఒరవడి ని ముందుకు తెస్తోంది. సీనియర్లను తలపండిన వారిని ఈసారి ఢిల్లీ విమానం ఎక్కించాలని చూస్తోంది. ముఖ్యంగా మంత్రుల ను ఎంపీలు గా బరి లోకి దింపితే ఉత్తమ ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్లుగా ఉంది. ఉత్తరాంధ్రా లో చూసుకుంటే శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిగా ఫిక్స్ చేయాల ని చూస్తున్నారు.
అదే విజయనగరం ఎంపీ సీటుకు మంత్రి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ను రెడీ చేస్తున్నారని టాక్. అనకాపల్లికి ఎంపీ అభ్యర్ధిగా భిమిలీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస రావు ని పోటీ చేయించాలని భావిస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా అరకు ఎంపీ అభ్యర్ధిగా ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొరను పంపించాలన్న ప్లాన్ ఉందని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరు కు ఫ్రెష్ క్యాండిడేట్ ని బరి లోకి దింపాల ని చూస్తున్నారని అంటున్నారు.
ఇక అమలాపురం నుంచి పినిసె విశ్వరూప్ ని, కాకినాడ ఎంపీ సీటు కు కురసాల కన్నబాబు వంటి వారిని పంపించాలని భావిస్తున్నారని అంటున్నారు. రాజం పేఅకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కర్నూల్ కి గుమ్మలూరి జయరాం, కడప ఎంపీ గా అంజాద్ భాషాని నిలబెడతారు అంటున్నారు. ఇదే తీరున ఇతర మంత్రుల ను సీనియర్ నేతల ను రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలలో పోటీకి నిలబెడితే గెలుపు గ్యారంటీగా ఉండడమే కాకుండా అసెంబ్లీకి కొత్త అభ్యర్ధుల ను ఎంపిక చేసేందుకు వీలు అవుతుందని భావిస్తున్నారని ప్రచారం అయితే సాగుతోంది.
ఈసారి మొత్తం అభ్యర్ధులలో నూటికి ఎనభై శాతం యాభై ఏళ్ల లోపు వారికే ఎమ్మెల్యేలనే నిలబెట్టాల ని చూస్తున్నారు అని అంటున్నారు. టోటల్ గా యూత్ ఫుల్ గా వైసీపీ ఎమ్మెల్యేల అభ్యర్ధుల టీం అంతా కనిపించాలన్నది ఆ పార్టీ మాస్టర్ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు. ఇదే క్రమంలో కొత్త వారిని దింపితే ప్రజల కు వారి మీద వ్యతిరేకత ఉండదు, ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ ఉండదని లెక్కలేస్తున్నారు.
ఆ మీదట వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలసి వస్తుందని, జగన్ ఇమేజ్ తో మరోసారి విజయఢంకా మోగించవచ్చు నని చూస్తున్నారు అంటున్నారు. కేవలం ఇర వై శాతం మాత్రమే సీనియర్లకు ఈసారి అనివార్యంగా టికెట్లు ఇస్తారని అంటున్నారు దీంతో ఇపుడు మంత్రుల కు మాజీ మంత్రుల కు సీనియర్లకు కూడా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాల్సిందే అన్న కంగారు అయితే పట్టుకుంది అని అంటున్నారు.
ఏపీ లో వైసీపీ చేస్తున్న ఈ ప్రయొగం సక్సెస్ అయి తీరుతుందని, ఏపీ రాజకీయాల్లో న్యూ ట్రెండ్ ని క్రియేట్ చేస్తుందని కూడా భావిస్తున్నారుట. మరి మంత్రులు అంతా రెడీనా అంటే రానున్న కొద్ది నెలల్లోనే అది కూడా తేలనుంది అంటున్నారు.