యువ నేత‌ల జోరున్నా.. అధిష్టానం ఛాన్స్ ఎవ‌రికి..?

Update: 2021-09-27 03:15 GMT
ఇద్ద‌రూ యువ నాయ‌కులు.. వార‌సులుగా వ‌చ్చి రాజ‌కీయాలు చేస్తున్న వారే. ఇద్ద‌రూ దూకుడుగానే ఉన్నా రు. అంతేకాదు.. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనికి కార‌ణం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యం! అయితే.. అధిష్టానం ఎవ‌రికి ఛాన్స్ ఇస్తుంది? అనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం.. అద్దంకి. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా గొట్టిపాటి ర‌వి విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. గ‌తంలో కాంగ్రెస్‌. త‌ర్వాత‌.. వైసీపీ.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఆయ‌న విజ‌యం సాధించారు.

అయితే.. ఇక్క‌డ వైసీపీ త‌ర‌ఫున ఎవ‌రికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇస్తార‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. దీనికి కార‌ణం.. ఇద్ద‌రు యువ నాయ‌కులు నువ్వా నేనా .. అన్న‌ట్టుగా బ‌రిలో నిలిచారు. ఇద్ద‌రూ కూడా రాజ‌కీయ వార‌సులే కావ‌డం.. జ‌గ‌న్‌కు స‌న్నిహితులే కావ‌డం.. ఆస‌క్తిగా మారింది. మాజీ ఎమ్మెల్యే.. సీనియ‌ర్ నాయ‌కు డు.. డాక్ట‌ర్ బాచిన చెంచుగ‌ర‌ట‌య్య కుమారుడు కృష్ణ‌చైత‌న్య‌.. ఆది నుంచి కూడా ఈ టికెట్ కోసం ఆశ‌లు పెట్టుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నారు. అయితే.. గ‌ర‌ట‌య్య‌కే జ‌గ‌న్ మొగ్గు చూపించారు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా.. త‌న‌కు టికెట్ ఇస్తార‌నే ఆశ‌తో కృష్ణ‌చైత‌న్య దూకుడుగా ఉన్నారు. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు. వ‌లంటీర్ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని .. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుతున్నాయా? లేదా.. అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుం టున్నారు. అదేస‌మ‌యంలో కార్య‌క‌ర్త‌ల‌ను కూడా క‌లుపుకొని కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన వైఎస్ వ‌ర్ధంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. దీంతో కృష్ణ చైత‌న్య పేరు జోరుగా వినిపిస్తోంది.

అయితే.. అదే స‌మ‌యంలో చీరాల ఎమ్మెల్యే.. అద్దంకి నుంచి 2004లో విజ‌యం ద‌క్కించుకున్న సీనియర్ నాయ‌కుడు.. క‌ర‌ణం బ‌లరాం కుమారుడు వెంక‌టేష్ కూడా ఈ టికెట్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. నిజానికి ఆశ‌లు అనే క‌న్నా.. త‌న‌కే ఇస్తార‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. త‌నకు త‌ప్ప ఇక్క‌డ ఎవ‌రికీ ఎడ్జ్ లేద‌ని.. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసుకుంటున్నారు. వైసీపీలో కీల‌క నేత‌ల ఆశీర్వాదం త‌న‌కు ఉంద‌ని.. త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పాగా వేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

వెంక‌టేష్ అద్దంకిలో 2014 ఎన్నిక‌ల‌లో పోటీ చేసి ఓడిపోయారు. పైగా చీరాల‌లో ఆయ‌న‌కు సామాజిక స‌మీక‌ర‌ణ‌లు అనుకూలంగా లేవు. ఏదేమైనా ఈ కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నుంచి ఇద్ద‌రు క‌మ్మ వార‌సులు పోటీలో ఉన్నారు. మ‌రి ఎవ‌రి త‌ల‌రాత ఎలా ? ఉందో ? కాల‌మే నిర్ణ‌యించాలి.




Tags:    

Similar News