రాజకీయ నేతలకు అభిమానులుండటం కద్దు. కొన్నిసార్లు ఈ అభిమానులు సినిమా స్టార్ల అభిమానులను మించి తమ అభిమానం చూపడంలో ముందుంటుంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన భక్తి అభిమానాన్ని తమ ఆరాధ్యనాయకుడిపట్ల చూపిస్తుంటారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ అభిమాని ఒక్కరు జగన్ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా అభిమానం చూపించడం వైరల్ గా మారింది.
కర్నూలుకు చెందిన ఒక ముస్లిం యువతి వై.ఎస్. జగన్ను ముఖ్యమంత్రిగా చూసేంత వరకు తాను పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞబూనారు. ఆమెకు సంబంధించిన విషయాలతో కూడిన వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నప్పుడు ఆయన్ను ముఖ్యమంత్రిగా చేయడానికి ఆయన వెంట ఎంతోమంది అహర్నిశం కష్టపడ్డారు.
ఆయన పాదయాత్ర చేసే సమయంలో ఆయన వెంట వేలాది మంది నడిచారు. కొందరు వైసీపీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులైతే అప్పులు చేసి ఆస్తులు అమ్మి మరీ తమ ప్రాంతాల్లో వైసీపీ జెండాలు కట్టారు. అక్కడ పార్టీ విజయం కోసం కంటిమీద కునుకు లేకుండా కష్టపడ్డారు.
అలా కష్టపడ్డవారిలో కర్నూలుకు చెందిన ముస్లిం యువతి వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి జమీలా బేగం ఒక్కరు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తాను పెళ్లి చేసుకోనని ఆమె ప్రతినబూనారు. అయితే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా ఆమె పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘జగనన్న అంటే పిచ్చి అభిమానం.. ఆయనను సీఎంగా చూడాలని 12 ఏళ్లుగా వైసీపీ అభివృద్ధి కోసం పని చేశాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరహార దీక్షలు చేశాను.. లాఠీల దెబ్బలు తిన్నాను. అధికారంలోకి వచ్చాక నాలాంటి కార్యకర్తలకు తీరని అన్యాయం జరుగుతోంది. కనీసం సీఎం జగన్ను కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదు’ అని కర్నూలుకు చెందిన వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి జమిలా బేగం కన్నీరు పెట్టుకున్నారు.
తమ బాధలు చెప్పుకుందామంటే సీఎం జగన్ కలిసే అవకాశం ఇవ్వడం లేదని, పదవుల పంపకాల్లో తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కర్నూలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో దీక్షను చేపట్టానని వివరించారు. మొత్తానికి ముస్లిం యువతి ఆవేదన.. జగన్ సీఎం అయ్యేందుకు చేసిన త్యాగం ప్రస్తుతం వైసీపీలో చర్చకు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా జగన్ కరుణిస్తారా? లేదా? చూడాలి.