తిరుపతిలో వైసీపీదే గెలుపు.. ఉప ఎన్నికకు ఊపు!

Update: 2021-03-14 11:45 GMT
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. ఇక్కడ టీడీపీ, బీజేపీ-జనసేన ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. దీంతో వచ్చే తిరుపతి ఉప ఎన్నికలకు ముందు ఈ జోష్ ఉంటుందని జగన్ పార్టీ విశ్వాసంతో ఉంది.

తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. తిరుపతి కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 7వ డివిజన్ తో తప్ప మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 21 డివిజన్లను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇక మిగిలిన 28 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 27 స్థానాల్లో వైసీపీ ఘనవిజయం సాధించడం విశేషం. ఒకే ఒక్క స్థానంతో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

తిరుపతి కార్పొరేషన్ గెలుపులో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఆయన తన బలాన్ని చాటుకున్నారు. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతలను తన కుమారుడైన భూమన అభినయ్ రెడ్డికి ఆయన అప్పగించారు. అభినయ్ స్వయంగా నాలుగో వార్డు నుంచి ఏకగ్రీవంగా గెలుపొందారు. తండ్రి పెట్టుకున్న నమ్మకాన్ని అభినయ్ రెడ్డి నిలబెట్టాడు. తిరుపతిలో వైసీపీకి తిరుగులేని ఏకపక్ష విజయాన్ని సాధించిపెట్టాడు.

తిరుపతిలో అభినయ్ రెడ్డి నేతృత్వంలో అంతా యువతకే ప్రాధాన్యం ఇచ్చి వారికే టికెట్లు ఇచ్చి ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో భూమన ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సక్సెస్ ను వచ్చేలా చక్రం తిప్పాడు.

తాజా ఫలితాలతో భూమన తన పట్టును మరోసారి నిలబెట్టి జగన్ కు చేరువయ్యారు. జగన్ సంక్షేమ పథకాలే గెలిపించాయని నమ్మకం పార్టీపై పోలేదని భూమన అన్నారు.




Tags:    

Similar News