సీఎం రికార్డు య‌డ్డీది కాదు..ఆ సీఎంది

Update: 2018-05-19 13:30 GMT
క‌న్న‌డ నేల ఓ ప్ర‌త్యేక రికార్డును న‌మోదు చేసుకుంది. దేశంలోనే అతి త‌క్కువ కాలం ముఖ్య‌మంత్రిగా ఉన్న నాయ‌కుడిని త‌మ రాష్ట్రం నుంచి అందించింది. అయితే ఆయ‌న అతి త‌క్కువ కాలం ప‌ద‌విలో ఉన్న జాబితాలో టాప్ స్థానం  దక్కించుకోలేదు. ఆ లిస్ట్‌ లో రెండో రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. రెండో సీఎంగా ఆ గుర్తింపు పొందారు. కేవ‌లం మూడు రోజుల పాటు మాత్ర‌మే ఆయ‌న సీఎంగా ఉన్నారు. అయితే ఇది మొద‌టి రికార్డ్ కాదు. రెండో రికార్డ్‌. ఒకరోజు సీఎంగా జగదాంబికా పాల్ రికార్డు సృష్టించారు.

ఉత్కంఠంగా సాగిన బలపరీక్ష ఎపిసోడ్‌ కు సీఎం యడ్యూరప్పే ఫుల్‌ స్టాప్ పెట్టారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీఎం యడ్యూరప్ప.. అసెంబ్లీలో ప్రకటించారు. విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత యడ్డీ మాట్లాడారు. అధికారాన్ని కోల్పోయినంత మాత్రానా తానేమీ కోల్పోలేదని ఆయన అన్నారు. కోర్టుల ఆదేశాల మేరకు సీఎంల పదవీ కాలం తగ్గిన ఘటనలు గతంలో కూడా వివిధ రాష్ర్టాల్లో జరిగాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌ లో జగదాంబికా పాల్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనూహ్య పరిణామాల మధ్య 1998 ఫిబ్రవరి 21న ఒక్కరోజు సీఎంగా పని చేశారు. 1997 అక్టోబర్ 21న బీజేపీకి చెందిన కల్యాణ్ సింగ్ ప్రభుత్వానికి బీఎస్‌పీ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో మైనారిటీలో పడిన కల్యాణ్‌ సింగ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ అసమ్మతి నేత నరేశ్ అగర్వాల్ మద్దతు పలికారు. నరేశ్ అగర్వాల్ ఆధ్వర్యంలోని లోక్‌ తాంత్రిక్ కాంగ్రెస్ శాసనసభా పక్షంలో జగదాంబికా పాల్ ఒక సభ్యుడు. 1998 ఫిబ్రవరి 21న నరేశ్ అగర్వాల్ మద్దతు ఉపసంహరించుకోవడంతో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. దీంతో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన యూపీ గవర్నర్ రమేశ్ భండారీ.. జగదంబికాపాల్‌ ను సీఎంగా నియమించారు. దీన్ని సవాల్ చేస్తూ కల్యాణ్ సింగ్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. యథాతథ పరిస్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించడంతో కల్యాణ్ సింగ్ తిరిగి సీఎంగా నియమితులయ్యారు.

ఇదిలాఉండ‌గా... మ్యాజిక్ ఫిగర్‌ ను చేరుకునేందుకు తెగ ప్రయత్నాలు చేసిన బీజేపీకి ఆ అదృష్టం దక్కలేదు. క్యాంపు రాజకీయాలు చేపట్టినా.. యడ్యూరప్ప టీమ్ ఆ పనిలో సక్సెస్ కాలేకపోయింది. ఒక విధంగా కాంగ్రెస్ - జేడీఎస్ సభ్యులు మాత్రం ఇప్పుడు ఆనందంలో తేలిపోయారు. తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన యడ్యూరప్ప.. గవర్నర్‌కు తన లేఖను అందించేందుకు వెళ్లారు. అయితే బలపరీక్షకు కావాల్సిన సంఖ్య లేకపోవడంతో బీజేపీ మధ్యలోనే చేతులెత్తేసింది. ఇక ఇప్పడు గవర్నర్ మీదే అందరి దృష్టి నిలిచింది.
Tags:    

Similar News