కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటైన మూడు వారాల తర్వాత కేబినెట్ కొలువుదీరింది. అయితే ప్రస్తుతం శాఖల కేటాయింపు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో పాటు పార్టీ పెద్దలకు తలనొప్పి మొదలైంది. ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే దానిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. మంత్రివర్గం ఏర్పాటుకే మూడు వారాలు దాటగా.. శాఖల కేటాయింపు మరో వారం రోజులు గడిచేలా ఉందని ప్రతిపక్షాల నుంచి విమర్శలు లేకపోలేదు. అయితే మరో రెండు రోజుల్లో శాఖలు ఇస్తామని సీఎం యడియూరప్ప చెబుతున్నారు. ప్రధాన ఖాతాలపై సీనియర్ మంత్రులు పట్టుబట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో శాఖల కేటాయింపులో కూడా అసమ్మతి రేగే అవకాశం లేకపోలేదు. ఇలాంటి తరుణంలో సీఎం యడియూరప్ప ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? ఎవరికి ఏ శాఖ ఇస్తారనేది చర్చనీయంగా మారింది. కేబినెట్ లో బెర్తు దక్కని వారు అసమ్మతి వ్యక్తం చేస్తున్న తరుణంలో సీఎం యడియూరప్పకు రెండువైపుల నుంచి చిక్కులు మొదలయ్యాయి.
ప్రజాపనులు- ఇంధనం- గ్రామీణాభివృద్ధి- జలవనరులు- రెవెన్యూ- హోం- భారీ పరిశ్రమలు- రవాణా తదితర శాఖలపై సీనియర్ నేతలు కన్నేశారు. ఆయా శాఖలు తమకే కేటాయించాలని పార్టీ పెద్దల వద్ద ఆర్.అశోక్- జగదీశ్ శెట్టర్- కేఎస్ ఈశ్వరప్ప- బసవరాజు బొమ్మయి- గోవింద కారజోళ తదితరులు లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈమేరకు సీఎం యడియూరప్పకు విజ్ఞప్తి కూడా చేసినట్లు తెలిసింది. ఒక్కో ఖాతాకు ముగ్గురు చొప్పున పోటీలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈక్రమంలో ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే దానిపై పార్టీ పెద్దలు సతమతం అవుతున్నారు. మంత్రివర్గం విస్తరణ కూడా ఒకట్రెండు నెలల్లో ఉంటుందని సమాచారం. ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తున్న ఐదుగురు లేదా ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది.
మంత్రివర్గంలో చోటు దక్కని ఓ వైపు అసమ్మతి వ్యక్తం చేస్తుండగా.. మంత్రివర్గంలో ఉన్నవారు శాఖల కోసం పట్టుబట్టడంతో సీఎం యడియూరప్పకు టెన్షన్ మొదలైంది. ఎవరికి శాఖలు ఇవ్వాలి.. ఎవరిని బుజ్జగించాలనే అయోమయంలో పడ్డారు. అయితే సీనియారిటీ ఆధారంగా శాఖల కేటాయించాలని సీఎం యడియూరప్ప తీర్మానించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఏయే మంత్రికి ఏ శాఖ ఇవ్వాలనేది సీఎం యడియూరప్ప వద్ద జాబితా ఇప్పటికే సిద్ధం చేసి ఉంచినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో గవర్నర్ వీఆర్ వాలాకు జాబితా అందజేసి శాఖలు అప్పజెప్పేందుకు యడియూరప్ప సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.