మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి వల్ల కర్ణాటక రాజకీయాల్లో హాట్ చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మాటల యుద్ధం మొదలైంది. కర్ణాటక అనగానే గాలి జనార్దన్ రెడ్డి గుర్తుకు రావడం సహజం. గాలి మైనింగ్ వ్యాపారం వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయనపై సీబీఐ కేసులు ఉన్నాయి. కొంతకాలం జైలు జీవితం అనుభవించిన తరువాత గాలి - బెయిలుపై విడుదలయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గాలి వర్గీయులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది.
అయితే ఈ పరిణామంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య విరుచుకుపడ్డారు. కర్ణాటక ప్రజలను మోసం చేసి వేల కోట్ల రూపాయల మైనింగ్ సొమ్మును బొక్కేసిన గాలి జనార్దన్ రెడ్డిని యడ్యూరప్ప ఎలా క్షమిస్తారని ప్రశ్నించారు. ప్రధాని మోడీతో మాట్లాడి - సీబీఐ కోర్టులో ఉన్న కేసులను మాఫీ చేయిస్తారా అని ఎద్దేవా చేశారు. కోట్లాది రూపాయల సొమ్మును అక్రమ మార్గంలో సంపాదించిన వ్యక్తులను తమ పక్కన పెట్టుకున్న బీజేపీకి ప్రజలు ఎలా ఓటు వేస్తారని వేస్తారని సిద్ధిరామయ్య ప్రశ్నించారు.హాసన్‌లో జరిగిన విలేకరులు సమావేశం లో ఆయన సమాధానం ఇచ్చారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సహాయంతో ఉత్తర కర్ణాటక బాగంలో బీజేపీకి 10 నుంచి 15 వరకు ఎమ్మెల్యే సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి మద్దతు తీసుకోవడం తన సొంత నిర్ణయం కాదని పార్టీ అధినేత అమిత్ షా నిర్ణయమని వెల్లడించారు.
గాలి మద్దతు తీసుకోవడం తమ పార్టీ అంతర్గత వ్యవహరమని పేర్కొంటూనే దీనివెనుక జరిగిన పరిణామాలను యడ్యురప్ప వివరించారు. బీజేపీకి లాభం వస్తుందని అనుకుంటే ఎంత శత్రువులు అయినా వారి సహాయం తీసుకోవాలని తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా చెప్పారని, అది మాకే లాభం అని యడ్యూరప్ప వివరించారు. గాలి జనార్దన్ రెడ్డి గతంలో బీజేపీకి సేవ చేశారని, ఆయన మద్దతు ఇస్తానంటే పార్టీ నిరాకరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు.ఓడిపోతామనే భయంతో సిద్దరామయ్య మతిలేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఆయనే చివరి ముఖ్యమంత్రి అని బీఎస్. యడ్యూరప్ప వ్యంగ్యంగా అన్నారు. తండ్రి, కుమారుడు పోటీ చెయ్యడం ఎందుకు అనుకొని తాము అనుకున్నామని అందుకే తన కుమారుడు రంగంలో లేరని వెల్లడించారు.