రాజీనామా: యెన్నంకు బీజేపీ బాగోలేద‌ట‌

Update: 2015-11-23 09:07 GMT
అధికార పార్టీకి చెందిన నేత‌కు భ‌విష్య‌త్తు అంతా దివ్యంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. అదేం చిత్ర‌మో కానీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేంద్రంలో కానీ.. రాష్ట్రంలో కానీ త‌మ పార్టీ ప‌వ‌ర్ లో ఉంటూ.. అంతులేని ధీమాతో నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. దానికి భిన్నంగా తెలంగాణ బీజేపీలో వ్య‌వ‌హారం ఉంది. తెలంగాణ బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి త‌న పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ.. కాంగ్రెస్‌ లు ప్ర‌త్యామ్నాయం కాద‌న్న ఆయ‌న‌.. గ‌డిచిన 18 నెల‌ల్లో ఆ పార్టీల వ‌ల్ల తెలంగాణ‌కు ఒరిగిందేమీ లేద‌న్న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. వాస్త‌వానికి కొద్దికాలంగా యెన్నం పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్నారు. ఆయ‌న కారు ఎక్కే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. అయితే అలాంటిదేమీ లేద‌ని.. సొంతంగా ఒక రాజ‌కీయ కుంప‌టి పెట్టుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లాకు చెందిన యెన్నం.. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ ప‌క్షాల వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని.. తెలంగాణ అధికార‌ప‌క్షానికి నిజ‌మైన ప్ర‌త్యామ్నాయ వేదిక ఒక ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే.. క‌మ‌లంలో కొన‌సాగకుండా తాజాగా పార్టీకి రాజీనామా చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

తెలంగాణ కోసం పోరాటం చేసిన వారు కేసుల్లో ఇరుక్కొని.. ఇప్ప‌టికీ కోర్టుల చుట్టూ తిర‌గాల్సి వ‌స్తుంద‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేసిన యెన్నం.. బీజేపీ.. కాంగ్రెస్‌ తో ఏం కాద‌ని తేల్చేయ‌టం గ‌మ‌నార్హం. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును మ‌రికొద్దిరోజుల్లో చెబుతాన‌ని ప్ర‌క‌టించారు. కేంద్రంలో చ‌క్రం తిప్పుతూ.. ద‌క్షిణాదిలో బ‌ల‌ప‌డ‌దామ‌ని భావిస్తున్న బీజేపీకి.. యెన్నం లాంటి వారు పార్టీకి రాజీనామా చేయ‌టం ఇబ్బందేన‌న్న మాట వినిపిస్తోంది. ఇక‌.. ఇప్ప‌టికే పులువురు సొంత కుంప‌ట్లు పెట్టుకొని.. వాటిని నిర్వ‌హించ‌లేక త‌ర్వాత ఎత్తేసిన నేప‌థ్యంలో.. యెన్నం ఏం చేస్తార‌న్న‌ది ప్ర‌శ్నే..?
Tags:    

Similar News