ఒక ప్రముఖ దేవాలయంలో స్వామివారి పవళింపు సేవకు ఒక గాయకుడు పాడిన పాటను తూచా తప్పకుండా వినిపించటం అంత తేలికైన విషయం కాదు. అందులోకి కోట్లాది మంది వెళ్లే శబరిమల ఆలయంలో ఇలాంటి అవకాశం అందరికి దక్కుతుందని చెప్పలేం. విశేష ప్రజాదరణ పొందటమే కాదు.. అయ్యప్ప భక్తులు తన్మయత్వంతో ఊగిపోయే స్వామివారి పవళింపు సేవ పాటకు సంబంధించి ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది.
శబరిమలై సన్నిధానంలో ఆలయం తెరిచి ఉన్న అన్ని రోజుల్లోనూ పవళింపు సేవ సమయంలో సంగీత స్రష్ఠ.. గాన గంధర్వుడిగా కీర్తించే ఏసుదాసు ఆలపించిన హరివరాసనం పాటను ప్లే చేస్తుంటారు.
నిజానికి స్వామివారి జోలపాటకు ఎన్నో రూపాలు ఉన్నా.. ఏసుదాసు పాడిన పాటనే ఆలయంలో వినిపిస్తుంటారు. అయితే.. ఈ పాట మూలంలో ప్రతి వాక్యంలోనూ ఉన్న స్వామి అనే మాట ప్రస్తుతం ఉన్న పాటలో లేకపోవం.. ఒక చోట ఆరి విమర్జనం అనే పదాన్ని తప్పుగా పలికినట్లుగా గుర్తించారు.
దీంతో.. ఆ లోపాన్ని సరిదిద్దాలని ట్రావెన్ కోర్ దేవస్థానం నిర్ణయించింది. 1920లో కొనకథు జానకీ అమ్మ అనే మహిళ రచించినట్లుగా చెబుతున్న హరివరాసనం మూలంలో ఎలా ఉందో.. అచ్చం అలానే పాడి స్వామివారి పవళింపు సేవ సమయంలో వినిపించాలని కోరుతున్నారు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పద్మకుమార్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. స్వామి పవళింపుసేవ పాటన రాసిన జానకీ అమ్మ వంశస్తుడే పద్మకుమార్ కూడా.
తాజాగా ఈ పాటకు మార్పులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రీరికార్డింగ్ సన్నాహాలు సాగుతున్నాయి. ఈ అంశంపై ఏసుదాసుతో ఇప్పటికే మాట్లాడామని.. ఆయన అందుకు సానుకూలంగా స్పందించినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఏసుదాసు తిరిగి రాగానే రీరికార్డింగ్ చేయనున్నారు.