ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందువరుసలో నిలిచి .ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాం... రాజకీయ పార్టీ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయన్న భావన వ్యక్తమవుతోంది. ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ తో కలిసి నడిచిన కోదండరాం... ఆ తర్వాత తెలంగాణలో ఏర్పడ్డ ఆ పార్టీ ప్రభుత్వంతో మాత్రం కలిసి ముందుకు సాగడం లేదు. ప్రజలు కోరుకున్న విధంగా ప్రభుత్వం నడవడం లేదని ఆరోపిస్తున్న కోదండరాం... అసలు ప్రజలు కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం రాలేదనే చెబుతున్నారు. తాము సామాజిక తెలంగాణ కోసం కష్టిస్తే... అందుకు విరుద్ధమైన పాలన అందిస్తున్న కేసీఆర్ సర్కారు... ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ముందుకు నడుస్తోందని ఆయన బహాటంగానే గళం విప్పుతున్నారు. కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న పలు పథకాల పట్ల కూడా ఆయన అసంతృప్తితోనే ఉన్నారని ఆయన వ్యాఖ్యలే చెబుతున్నాయి.
ఈ క్రమంలో పూర్వాశ్రమంలో ఆప్ లో కీలక నేతగా ఉండి, ప్రస్తుతం జైకిసాన్ ఆందోళన్ కన్వీనర్ గా కొనసాగుతున్న ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ నిన్న హైదరాబాదు వచ్చిన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయం అన్న అంశంపై నిన్న తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన ప్రత్యేక సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే... సమీప భవిష్యత్తులోనే కోదండరాం రాజకీయ పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న భావన వ్యక్తమవుతోంది. అయినా యోగేంద్ర యాదవ్ ఆ సదస్సులో చేసిన వ్యాఖ్యలను ఓసారి పరిశీలిస్తే... తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అస్తవ్యస్తంగా ఉందని, దీనిని సరి చేసేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం ఉందని ఆయన అన్నారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలో రాజకీయ పార్టీ రావాలని, ఇది ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. అవినీతి - అసమర్థ ప్రభుత్వా లను ఎదుర్కొని ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ఉండే వేదిక ఏర్పడాలని యాదవ్ వ్యాఖ్యానించారు.
స్వచ్ఛంద సంస్థలు - సంఘాలు - యాక్టివ్ గా ఉన్న మీడియా.. ఇలా నీతితో కూడిన సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు విలువలతో కూడిన రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నట్లు యాదవ్ చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుండే పార్టీ... నిజాయితీ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత గాలిలో కలసిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి, సమస్యల పరిష్కార దృష్టి.. ఇలా అనేక అంశాలతో అనుభవజ్ఞులతో కూడిన పార్టీ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. కోదండరాం నేతృత్వంలో విలువలతో కూడిన పార్టీ ఏర్పాటు కావాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీలన్నీ ఒక సామాజిక ఎజెండాతో వచ్చి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు కోదండరాం కూడా హాజరయ్యారు. కోదండరాం సమక్షంలోనే యాదవ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
యాదవ్ మాట్లాడిన తర్వాత మైకందుకున్న కోదండరాం కూడా తన రాజకీయ రంగ ప్రవేశం తప్పేలా లేదని వ్యాఖ్యానించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కోదండరాం మాట్లాడుతూ అరవై ఏళ్ల పాటు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాల్లోకి రావడం తప్పదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పార్టీ ఏర్పాటును కాలమే నిర్ణయిస్తుందని పేర్కొ న్నారు. పాలనా వ్యవస్థలో అవినీతిని రూపు మాపేందుకు ప్రత్యామ్నాయ శక్తిగా పోరా డేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఉద్య మాలు చేసి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ పెత్తందారి దోపిడీయే కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందున్న పార్టీ కర్తవ్యాలు ఆ తర్వాత మారిపో వడం సమాజాన్ని అజ్ఞాతంలోకి నెట్టిందని కూడా కోదండరాం వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/