మీరు ఉద్యోగి. మీకు నెల నెలా జీతం వస్తుంది. ఏడాది చివర్లో జీతం కింద వచ్చే మొత్తాన్ని కలిపి.. అందులో ఆదాయపన్ను మినహాయింపు తీసివేసి.. మొత్తం ఆదాయానికి ఆదాయపన్నును కట్టేస్తుంటారు. మరి.. ఇదే పని ముఖ్యమంత్రి.. మంత్రులు ఎందుకు చేయరు? ప్రభుత్వం ఇచ్చే జీతాల మీద కట్టాల్సిన ఆదాయపన్నును సైతం ఖజానా నుంచే తీసుకోవటంలో అర్థం ఉందా? అన్న ప్రశ్న వేస్తే.. లేదనే మాటను చెప్పేస్తారు.
కానీ.. ఇప్పటివరకూ సీఎం.. మంత్రుల జీతాల మీద కట్టాల్సిన ఆదాయపన్నును ప్రభుత్వమే కట్టేస్తున్న వైనంపై కన్నెర్ర చేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్. యూపీలో ఈ విధానం 1981 నుంచి అమలవుతోంది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత దాదాపు తొమ్మిది మంది వరకూ ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రానికి మారారు.కానీ.. వారెవరూ ఈ అంశంపై మాత్రం దృష్టి పెట్టలేదు.
అందుకు భిన్నంగా సీఎం యోగి మాత్రం సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ముఖ్యమంత్రులు.. మంత్రులు తమకొచ్చే జీతాల మీద కట్టాల్సిన ఆదాయపన్నును ఎవరికి వారు కట్టుకోవాల్సిందే తప్పించి.. ప్రభుత్వం వారి ఆదాయపన్ను మొత్తాన్ని చెల్లించదన్న కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం యోగి.. వారి మంత్రుల జీతాల మీద చెల్లించాల్సిన ఆదాయపన్ను కోసం ప్రభుత్వం రూ.81 లక్షలు ఖర్చు చేయటంతో ఈ వ్యవహారంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
గతంలో ఈ నిర్ణయాన్ని తీసుకోవటానికి కారణం లేకపోలేదని.. అప్పట్లో ముఖ్యమంత్రి వేతనం రూ.వెయ్యి.. మంత్రుల వేతనాలు రూ.650 మాత్రమేూ. కానీ ఇప్పుడు సీఎంకు నెలకు రూ.40వేలు ఇస్తుంటే.. మంత్రులకు రూ.35 వేలు ఇస్తున్నారు. గడిచిన 38 ఏళ్లలో మంత్రుల జీతాలు 40 సార్లు పెరిగినా.. పాత విధానాన్ని అమలు చేస్తూనే వచ్చారే కానీ.. ఏ ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని మార్చింది లేదు.
ఇందుకు భిన్నంగా తాజాగా యోగి సర్కారు మాత్రం.. మంత్రుల ఇన్ కం ట్యాక్్ ను ఎవరికి వారు చెల్లించాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. ఈ సంచలన నిర్ణయంపై పలువురు ప్రశంసిస్తున్నారు. మిగిలిన సంగతలు ఎలా ఉన్నా.. ఇలాంటి విషయాలతో యోగి అంటే ఫిదా అయ్యేలా చేస్తుంటారని చెప్పక తప్పదు.