ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ గ్రాఫ్ చిత్రంగా కనిపిస్తుంది. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా పేరున్న ఎంపీగా ఆయన దేశ ప్రజలకు సుపరిచితులు. అలాంటి ఆయన్ను యూపీ లాంటి కీలక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తూ ప్రధాని మోడీ అందరిని ఆశ్చర్యచకితుల్ని చేశారు. యూపీ పీఠాన్ని యోగి చేతుల్లో పెడతారా? అంటూ సందేహాలు వ్యక్తం చేసిన వారంతా సీఎంగా యోగి ప్రదర్శించిన చతురతకు ఫ్లాట్ అయ్యారు.
ఒకదశలో మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదన్న భావన అందరిలో వ్యక్తమైంది. అయితే.. ఇది ముణ్నాళ్ల ముచ్చటగా మారిందా? అన్న సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవల కాలంలో పాలనా పరంగా సీఎం యోగి తీసుకుంటున్న నిర్ణయాలే కారణంగా చెబుతున్నారు.
ఇప్పటికే అధికారపక్ష ఎమ్మెల్యే రేప్ ఆరోపణలపై చూసీచూడనట్లుగా యోగి సర్కారు వ్యవహరించిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తుంటే.. మరోవైపు కేంద్ర మాజీ మంత్రిపై ఏడేళ్ల క్రితం నమోదైన అత్యాచార కేసును ఎత్తివేస్తూ యోగి సర్కారు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
2011లో ఆశ్రమంలో ఉన్న తనపై కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి స్వామి చిన్నయానంద అత్యాచారం చేసినట్లుగా ఒక బాలిక ఫిర్యాదు చేసింది. ఈ ఉదంతం అప్పట్లో సంచలనంగా మారింది. తనను ఆశ్రమంలో ఉంచి చిన్నయానంద అత్యాచారం చేసినట్లుగా షాజహాన్ పూర్ లోని కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఏసింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించి తాను అరెస్ట్ కాకుండా స్టే తెచ్చుకున్నారు.
ఇది జరిగి ఏడేళ్లు కావొస్తోంది. ఈ వ్యవహారం అలా పెండింగ్ లోనే ఉంది. ఇదిలా ఉంటే.. మాజీ కేంద్రమంత్రిపై నమోదైన కేసును విత్ డ్రా చేసుకోవాలంటూ షాజహాన్ పూర్ జిల్లా అధికారులు ప్రాసిక్యూషన్ కు లేఖ రాశారు. అత్యాచారం చేసినట్లుగా చెప్పే సాక్షులు లేకపోవటంతో ఈ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లుగా యోగి సర్కారు కోర్టుకు చెప్పింది. దీనిపై యోగి సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వాజ్ పేయ్ సర్కారులో చిన్మయానంద కేంద్ర అంతర్గత భద్రత సహాయ మంత్రిగా పని చేశారు. 1991.. 1998.. 1999లో మూడుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ఏడేళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసును ఎత్తి వేస్తూ యోగి సర్కారు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో తప్పుల మీద తప్పులు చేస్తున్న యోగి సర్కారు.. ఈఉదంతంలో మరోమారు తప్పు చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూస్తుంటే.. సీఎం యోగి తప్పుల వ్రతాన్ని చాలా కచ్ఛితంగా చేస్తున్నట్లుగా ఉంది.